24 గంటల్లో రిజిస్ర్టేషన్ !
ABN , Publish Date - May 15 , 2026 | 12:48 AM
వాహనాల రిజిస్ర్టేషన్‌ను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్లలో మరో అడుగు ముందుకేసింది. కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ర్టేషన్ అయిపోవాలి.24 గంటలు మాత్రమే అందుకు గడువు విధించింది.
ఒకరోజు దాటిందంటే పూర్తయినట్టే
రవాణా శాఖ పరిశీలించకపోయినా అంతే..
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జిల్లాలో ఏటా 36 వేల కొత్త వాహనాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వాహనాల రిజిస్ర్టేషన్‌ను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్లలో మరో అడుగు ముందుకేసింది. కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ర్టేషన్ అయిపోవాలి.24 గంటలు మాత్రమే అందుకు గడువు విధించింది. అంతలోగానే వాహన రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తికావాలి. లేకపోయినాసరే అది అయి పోయినట్టుగానే పరిగణిస్తారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి గత కూటమి ప్రభుత్వంలోనే ఆన్‌లైన్ విధానాన్ని అమ లులోకి తీసుకొచ్చారు. వాహనాలు కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. దానిని రవాణా శాఖ కార్యాల యంలో పరిశీలించాలి. అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా యంటే ఆమోదించేవారు. తద్వారా రిజిస్ర్టేషన్ అయి పోతుంది. వాహన నంబర్ కూడా షోరూమ్‌కే వచ్చేస్తుంది. దీనివల్ల వాహన కొనుగోలు అనంతరం రిజిస్ర్టేషన్ కోసం రావాణా శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏజంట్‌లను ఆశ్రయించాల్సిన పనిలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆన్‌లైన్ విధానంపై పెద్దగా పర్యవేక్షణ లేకపోయింది. ఒక్క రోజు వ్యవధిలో రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తయ్యేది కాదు. డాక్యుమెంటేషన్‌లో లోపం ఉంటే వాయిదా పడేది.రవాణా అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించకపోయినా సరే రిజిస్ర్టేషన్ అయ్యేది కాదు.
వాహనదారులకు ఈజీ
జిల్లాలో ప్రతిఏటా 36 వేల కొత్త వాహనాలు అమ్ముడుపోతున్నాయి. రవాణా కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ చేయాలనకుంటే పెద్దగా రద్దీ ఉంటోంది. ఏజంట్‌లే రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ చేయాల్సి వచ్చేది. రవాణా అధికారులకు ఇతర సేవలు కూడా అధికంగా ఉంటున్నాయి. రోడ్డు భధ్రత ప్రధానమవుతోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహ దారులపై వాహనాలను పర్యవేక్షించాలి. రిజిస్ర్టేషన్ చేయాలన్నా. ఫిట్‌నెస్ ఇవ్వాలన్నాసరే ఉక్కిరిబిక్కిరి అయ్యే వారు. ప్రభుత్వం ఇటీ వల కాలంలో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయడంతో సేవలు సునాయా సమవుతున్నాయి. ప్రస్తుతం 24 గంటల రిజిస్ర్టేషన్ ప్రక్రియపై కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది
షోరూమ్‌ల్లో తప్పిదాలపైనే గుబులు
వాహనాలు కొనుగోలు చేసిన రోజునే రిజిస్ర్టేషన్‌లు అయిపోతున్నాయి. కొనుగోలు దారులకు ఇబ్బంది లేదు. రవాణా శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. డాక్యుమెంటేషన్ అంతా సవ్యంగా ఉంటోంది. రవాణా అధికారులు ఇతర విధుల్లో బిజీగా ఉన్నట్టయితే ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ డాక్యు మెం ట్‌లను పరిశీలించే అవకాశం ఉండదు. అటువంటప్పుడు తప్పుడు డాక్యుమెంట్లు అయినా 24 గంటల వ్యవధిలో రిజిస్ర్టేషన్ అయిపోయినట్టే. అక్కడే ఇబ్బందులు ఎదురు కానున్నాయని రవాణా అధికారుల్లో ఒకింత గుబులు నెలకొంది. తప్పులు దొర్లితే షోరూమ్ సిబ్బంది కంటే అధికా రులపైనే బాధ్యత ఉంటుంది. ప్రస్తుతం పలు షోరూమ్‌ల్లో పరిమితికి మించి బీమా చేస్తున్నారు సిబ్బందికి పర్సంటేజీలు లభిస్తా యన్న ఉద్దేశంతో బీమా ప్రీమియం అధికంగా వసూలు చేస్తున్నారు. రవాణా అధికారులు దీనిపై షోరూమ్ యజ మానులను ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది తప్పిదం వల్ల జరిగిం దంటూ యజమానులు చెప్పు కొస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులను అధిగమిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది.