Share News

450 రిజిస్ర్టేషన్లు.. రూ.కోటి 94 లక్షల ఆదాయం

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:28 AM

జిల్లాలో రిజిస్ర్టేషన్‌శాఖ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. గత జూలై 21 నుంచి దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌తో కార్యకలా పాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

450 రిజిస్ర్టేషన్లు.. రూ.కోటి 94 లక్షల ఆదాయం

ఆగస్టు ఒకటో తేదీన రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు

కోలుకున్న రిజిస్ట్రేషన్‌ శాఖ

ఏలూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి):జిల్లాలో రిజిస్ర్టేషన్‌శాఖ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. గత జూలై 21 నుంచి దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌తో కార్యకలా పాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వారు సమ్మె విరమణతో శనివారం ఒక్కరోజే 426 రిజిస్ర్టేషన్‌ లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.కోటి 94 లక్షల 35 వేల ఆదాయం సమ కూరింది. భీమడోలు 40, చింతలపూడిలో 39, జంగారెడ్డిగూడెం 38, కామవరపు కోటలో 45, పోలవరంలో 21, గణపవరంలో 39, వట్లూరులో 34, కైకలూరులో 24, మం డవల్లిలో 15, నూజివీడులో 52, ముదినేపల్లి లో 15 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో డాక్యు మెంట్‌ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏలూరు జిల్లా కార్యాలయంలో అత్యధికంగా 64 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖ దాదాపు కోలుకున్నట్లేనని భావిస్తున్నా రు. రాబోయేది శ్రావణమాసం నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు మరింత పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:28 AM