Share News

పల్లెకు రెబెల్స్‌ పోటు

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:01 AM

పల్లెపోరులో సర్పంచ్‌ అభ్యర్థులకు ప్రతి మండలంలోను రెబెల్స్‌ తలపోటుగా మారారు. జిల్లాలో 11 మండలాల్లో 177 సర్పంచ్‌ పదవులకు 997 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది.

పల్లెకు రెబెల్స్‌ పోటు

భారీగా నామినేషన్లతో ప్రధాన అభ్యర్థుల్లో కలవరపాటు

తెరవెనుక పెద్దల మంత్రాంగం

రేపటి వరకు తప్పని టెన్షన్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పల్లెపోరులో సర్పంచ్‌ అభ్యర్థులకు ప్రతి మండలంలోను రెబెల్స్‌ తలపోటుగా మారారు. జిల్లాలో 11 మండలాల్లో 177 సర్పంచ్‌ పదవులకు 997 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. ఈసారి కూటమి పార్టీల నుంచి టీడీపీ, జనసేన అనుకూలురైన అభ్యర్థులే ఎక్కువ పోటీకి సిద్ధం అయ్యారు. అయితే వీరికి రెబెల్స్‌ కంటిలో నలుసులా మారారు. వైసీపీ అనుకూలురైన అభ్యర్థులదీ ఇదే పరిస్థితి. దీంతో వారిని బరి నుంచి తప్పిం చేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. దాఖలైన నామినేషన్ల పరిశీలన బుధవారం పూర్తయింది. ఇందులో స్వల్ప సంఖ్యలోనే తిరస్కరణకు గురయ్యాయి. 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పంచా యతీల్లో పరువు–ప్రతిష్ట కోసం పోరులో నిలిచేందుకు టీడీపీ, జనసేన, వైసీపీ అనుకూలురైన అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెబెల్స్‌ను బరి నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. కాగా ఇప్పటి వరకు సరిగ్గా పల్లె ప్రచా రంలో అభ్యర్థులు పాల్గొనలేదు. ఇంకా గుర్తులు ఖరారు కాకపోవడంతో 21వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లి అభ్యర్థించాల్సి ఉంటుంది. 26న ఎన్నికలు జరగనున్న విషయం తె ల్సిందే.

రెబెల్స్‌ పోటు.. మంతనాలు

పట్టణీకరణ మాదిరిగానే గ్రామాల్లో భారీగా మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తు న్నాయి. దీంతో సర్పంచ్‌ పదవికి ప్రాధాన్యం ఏర్పడింది. లే–అవుట్లు, మంచినీటి పథకాలు, ఇసుక తవ్వకాలు, అభివృద్ధి పనుల కాంట్రా క్టులు, పారిశుధ్య పనులు, సిబ్బంది నియా మకం, ఇతర లావాదేవీలు సర్పంచ్‌ చేతుల మీదుగా జరగనుండటంతో పట్టణం తరహా లోనే పల్లెల్లోను సర్పంచ్‌ పదవీ ఖరీదెక్కిం ది. ఎన్నికల్లో లక్షలాది రూపాయాలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రెబెల్స్‌ నామినేషన్ల వల్ల ప్రధాన పార్టీల అనుకూలురైన అభ్యర్థుల విజయావకాశాల ను దెబ్బతీసే అవకాశం ఉంది. సర్పంచ్‌గా గెలవడం ప్రతిష్టగా భావించడంతో పోటీలో రెబెల్స్‌ను తప్పించడానికి మంత్రాంగం నడి పేందుకు నేతలు పెద్దలు పావులు కదుపుతున్నారు. వీరిని వదిలించుకునేందుకు కనీసం రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు బేరసారాలు సాగుతుంటాయి. లింగపాలెం పంచాయతీలో పది మంది నామినేషన్లు వేశారు. ధర్మాజీగూడెం మేజర్‌ పంచాయతీలో ఏడుగురు బరిలోకి దిగారు. జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడుల్లో రెబెల్స్‌ బెడద అంతగా లేదు. జీలుగుమిల్లి, వేలేరుపాడు, బుట్టాయగూడెంల్లో జడ్పీటీసీలను వైసీపీ తన ఖాతాలో వేసుకోవడంతో ఇప్పుడు పంచాయతీల్లో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు ప్రచారం చేయాల్సిన గడువు వారం కూడా లేకపోవడంతో ప్రధాన అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది.

Updated Date - Nov 19 , 2026 | 12:01 AM