వరదలు ఎదుర్కొనేందుకు అంతా సన్నద్ధం
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:59 AM
అనూహ్యంగా గోదావరికి వరద రావడం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని రహ దారుల పైకి వరద రావడం వరద మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలుం డడంతో కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తమయ్యారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి
వేలేరుపాడు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అనూహ్యంగా గోదావరికి వరద రావడం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని రహ దారుల పైకి వరద రావడం వరద మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలుం డడంతో కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తమయ్యారు. శుక్రవారం దెందు లూరు పీజీఆర్‌ఎస్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికి రద్దు చేసుకుని వేలేరు పాడుకు చేరుకుని అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వరద పరిస్థితిపై సమీక్షించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా వరద చుట్టుముట్టిన కారణంగా బయట ప్రాంతాలకు రాలేని ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పున రావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.. ఈ రెండు మండలాలకు 12 బోట్లు కావాల్సి ఉందని, ఇప్పటికే నాలుగు సిద్ధంగా ఉండగా మరో ఎనిమిది బోట్లు శనివారం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో హాబిటేషన్‌లో ప్రత్యేకాధికారి ఉండాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సురక్షిత తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఎలాంటి లోటుపాట్లు జరిగిన సంబంధిత అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్.శ్రావణ్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రానికి వెళ్లండి..
కుక్కునూరు : గోదావరి వరద ముంచుకొస్తున్న తరుణంలో గొమ్ము గూడెం గ్రామస్థులంతా దాచారం పునరావాస కాలనీకి తరలివెళ్లాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. శుక్రవారం గొమ్ముగూడెం గ్రామస్థులతో మాట్లాడారు. దాచారం పునరావాస కాలనీలో సౌకర్యాలు పరిశీలించారు. అధికారులు పునరావాస కాలనీకి వచ్చే బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందించడానికి సిద్ధం చేశారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ఏర్పాటు చేసి గొమ్ముగూడెం నుంచి పునరావాస కాలనీకి తరలి వచ్చేందుకు సహకరించారు.