మళ్లీ ఉద్యోగానికి రండి..!
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:35 AM
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగులు, అధికారుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 60 నుంచి 62కు పెంచ డంతో రిటైర్డు ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సొసైటీలు, గురుకులాల రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట
60 నుంచి 62 ఏళ్లకు వయోపరిమితి పెంపు
జిల్లాలో 250 మంది వరకు ప్రయోజనం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగులు, అధికారుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 60 నుంచి 62కు పెంచ డంతో రిటైర్డు ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొంత మంది కోర్టును ఆశ్రయించిన వారు లేక పో లేదు. అన్ని వర్గాల ఉద్యోగు లను పరిగణనలోకి తీసుకుని తిరిగి కొనసాగింపునకు అవకాశం కల్పించడా నికి రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 250 మంది వరకు లబ్ధి పొందనున్నా రు. ప్రభుత్వం తీసుకున్న కటాఫ్ తేదీల్లో రిటైర్ అయిన వారికి పెన్షన్, ఇంక్రిమెంట్స్ బెనిఫిట్స్ కలగనున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్, వివిధ సొసైటీల్లో రిటైరయ్యి అరకొర పెన్షన్‌తో జీవితా లను నెట్టుకొస్తున్న అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 32 నుంచి 35 ఏళ్లకు పైబడి ఉద్యోగ సర్వీసు చేసినా... చివరకు 3 నుంచి 5వేల పెన్షన్లతో వివిధ శాఖల రిటైర్డు ఉద్యోగులు దుర్భరంగానే జీవిస్తున్నారు. ప్రభు త్వం ఇలాంటి వారందరికి ఊరటనిస్తూ 60 ఏళ్ల వయోపరిమితిని 62కు పెంచుతూ జీవోను జారీ చేయడంతో రిటైర్డు ఉద్యోగులకు జీవితంపై భరోసా ఏర్పడింది. 2025 తర్వాత నుంచి ఇటీవల కాలంలో రిటైరైన ఉద్యోగులు, అధికారులను అవసరాన్ని బట్టి ఆయా కార్పొ రేషన్లు విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు ఉద్యోగులు, అధికారులు ఆయా సంస్థలకు తమను ఉద్యోగంలోకి తీసుకో వడానికి వర్తింప చేయాలని కోరుతూ ప్రతిపాద నలు ఇస్తారు. దీనిపై ప్రభుత్వ రంగ సంస్థలు బోర్డులు చర్చించి తుది నిర్ణయం తీసుకుం టాయి.
15 శాఖల వరకు ప్రయోజనం
జిల్లాలో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, సెట్వెల్, ఏపీఐఎస్‌డీసీ, పీఏసీఎస్, సెరికల్చర్, హార్టికల్చర్, ఆగ్రోస్, సాంఘిక సంక్షేమశాఖ సొసైటీలు, గురుకులాల్లో తదితర శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులను వారి కాలాన్ని బట్టి తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ ఏడాది మే నెలలోనే సెట్వెల్ సీఈవో కోట ప్రభాకరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలతు రిటైర్ అయ్యారు. వీరికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వనున్నారు. 60 ఏళ్లకు రిటైర్ అయ్యిన వారికి పెన్షన్ ఇంక్రి మెంట్లు, కుమిటెడ్ వాల్యూ పెన్షన్, రిటైర్‌మెంట్ గ్రాడ్యూటీ, ఎర్న్‌లీవ్ పెంపు తదితర అంశాలలో ప్రయోజనం చేకూరనుంది. 2022 జనవరి 1 నుంచి రిటైర్ మెంట్ అయిన వారికి బెనిపిట్లు అందనున్నాయి.
ఎన్జీవో నేతల హర్షం
ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట నిస్తూ వయోపరిమితి 60 నుంచి 62కు పెంచ డం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మందికి లబ్ధి చేకూరనుందని జిల్లా ఎన్జీవో సంఘం అధ్య క్షుడు చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌ఎస్ హరనాథ్ హర్షం వ్యక్తం చేశారు.