Share News

రాట్నాలమ్మ హుండీల ఆదాయం రూ.12.66 లక్షలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:24 AM

పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నా లమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.12,66,336 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు.

రాట్నాలమ్మ హుండీల ఆదాయం రూ.12.66 లక్షలు
ఆలయంలో హుండీల సొమ్ము లెక్కిస్తున్న సిబ్బంది

పెదవేగి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నా లమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.12,66,336 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు. దేవదాయ, ధర్మదాయశాఖ ఏలూరు పడమర వీధి వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో పి.రీనామాధురి పర్యవేక్షణలో హుండీల సొమ్ములను తెరిచి, భక్తులు సమర్పించిన సొమ్మును బుధవారం లెక్కించారు. 58 రోజులకుగాను రూ.12,66,336 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు, ఆల య సిబ్బంది, భక్తులు హుండీల ఆదాయాన్ని లెక్కించారు.

Updated Date - Jun 25 , 2026 | 12:25 AM