Share News

రేషన్‌ బియ్యంలో కెర్నల్‌కు స్వస్తి

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:21 AM

రేషన్‌ బియ్యంలో పోర్టిఫైడ్‌ కెర్నల్‌ కలిపే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పడంతో రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమకు ఊరటనిచ్చింది. ప్రజలకు బలవర్ధకమైన బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో పోషక విలువలతో కూడిన కెర్నల్‌ను క్వింటాల్‌ కు కిలో వంతున కలిపేది.

రేషన్‌ బియ్యంలో కెర్నల్‌కు స్వస్తి

కేంద్రం నిర్ణయం.. మిల్లర్లకు ఊరట

జాప్యంతో లభించని పోషకాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రేషన్‌ బియ్యంలో పోర్టిఫైడ్‌ కెర్నల్‌ కలిపే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పడంతో రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమకు ఊరటనిచ్చింది. ప్రజలకు బలవర్ధకమైన బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో పోషక విలువలతో కూడిన కెర్నల్‌ను క్వింటాల్‌ కు కిలో వంతున కలిపేది. ఈ మేరకు మిల్లర్ల కు సరఫరా చేసేది. వాటిని రేషన్‌కు ఇచ్చేసరికి నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గోదా ముల్లో భద్రపరచిన తర్వాత రేషన్‌కు తరలిస్తు న్నారు. దీంతో కెర్నల్‌లో ఉన్న పోషక విలువలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ప్రజలకు పెద్ద ప్రయోజనం ఉండడం లేదంటూ కేంద్ర ప్రభు త్వం గుర్తించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బియ్యం అప్పగింత లో మిల్లర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. కెన్నల్‌పై అన్ని కోణాల్లోనూ పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇకపై మిల్లర్లు అప్పగించే కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యానికి వెసులు బాటు ఇచ్చింది. కెర్నల్‌ లేకుండానే సరఫరా చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. దాంతో రైస్‌ మిల్లర్లలో జోష్‌ నెలకొంది. బియ్యంలో కెన్నెల్‌ కలిపేందుకు మిల్లర్లు ప్రత్యేకంగా మిష నరీని ఏర్పాటు చేసుకున్నారు. ఇకపై అటువం టి ఇబ్బందులు లేవు. భారతీయ ఆహార సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే బియ్యంలో కెర్నల్‌ కలపడం లేదు. రాష్ట్ర ప్రభు త్వానికి అప్పగించే బియ్యంలోనే కలుపుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన బియ్యాన్నే రేషన్‌ అవసరాలకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు.

మంచి పరిణామం

‘కేంద్ర ప్రభుత్వం కెర్నల్‌ వినియోగంపై సానుకూల నిర్ణయం తీసుకోవడంతో మిల్లర్లకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి. సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతల’ని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సామంత పూడి శ్రీరామరాజు తెలిపారు.

Updated Date - Mar 01 , 2026 | 12:21 AM