Share News

డిసెంబరు నాటికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు పూర్తిచేయాలి

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:17 AM

పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున నిర్వాసి తులకు కోసం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాలని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ప్రశాంతి అధికారులను ఆదేశించారు.

డిసెంబరు నాటికి  ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు పూర్తిచేయాలి
దొరమామిడి కాలనీలో ఇల్లును పరిశీలిస్తున్న కమిషనర్‌ ప్రశాంతి

పరిహారం చెల్లింపులు, నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకు రూ.200 కోట్లు విడుదల : కమిషనర్‌ ప్రశాంతి

బుట్టాయగూడెం, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున నిర్వాసి తులకు కోసం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాలని ఆర్‌అండ్‌ఆర్‌ కమి టషనర్‌ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఏజెన్సీకి విచ్చేసి దొరమామిడి, ముప్పినవారి గూడెం, బుట్టాయగూడెం శివాలయం, రామన్నగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలిం చారు. 41.15 కాంటూరు పరిధిలో కొన్ని ఇళ్లు, 45 కాంటూరు పరిధిలో మరికొన్ని ఇళ్లను అధికారులు నిర్మించారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు. గతంలో నిర్మాణాలు పూర్తిచేసిన ఇళ్లకు నిర్వాసితులు రాకపోవడంతో మైనర్‌ రిపేర్లు వచ్చాయని వాటిని పూర్తి చేయాలని అధికారుల తెలుపగా సరేనన్నారు. 41.15 కాంటూరు పరిఽ దిలో నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1,500 ఇళ్లను నిర్మించాల్సి ఉందన్నారు. కాలనీల్లో అన్నిశాఖలు సమన్వ యంతో అన్ని మౌలిక సదుపాయలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి పరిహారం చె ల్లింపులు, నిర్మాణాలు, మౌలిక సదుపాయా లకు 200 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. 2027 నాటికి 41.15 కాంటూరు పరిదిలోని నిర్వాసితులకు కాలనీలు పూర్తి చేసి తరలిస్తామన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ అభిషేక్‌, పీవో రాములు నాయక్‌, హౌసింగ్‌ డీఎం సత్యనా రాయణ, ఈఈ కేవీవీఆర్‌ ప్రసాద్‌, ఎస్‌డీసీ ఆంజనేయులు, తహసీల్దార్‌ ప్రమద్వర, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వినతులు అందించిన నిర్వాసితులు

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఏజెన్సీకి వచ్చిన కమిషనర్‌కు దొరమామిడి, ముప్పినవారిగూడెం, రామ న్నగూడెం గ్రామాలకు చెందిన కాలనీల నిర్వాసితులు వినతిపత్రాలను అందజేశారు. కాలనీలో శ్లాబులు వర్షాలకు నీరు కారుతున్నాయని, కిటికీలు, తలుపులు పాడయ్యాయని తదితర సమస్యలు తెలిపి పరిష్కరించాలని నిర్వాసితులు కోరారు. కమిషనర్‌ను కలిసినవారిలో ముత్యాలరెడ్డి, రాజారెడ్డి, ఆశోక్‌రెడ్డి, రత్నకుమార్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:17 AM