Share News

డీసీసీ అధ్యక్షుడిగా రాజనాల

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:59 AM

సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాజనాల రామ్మో హన్‌రావును మూడోసారి డీసీసీ పీఠం వరించింది.

డీసీసీ అధ్యక్షుడిగా రాజనాల

ఏలూరు రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాజనాల రామ్మో హన్‌రావును మూడోసారి డీసీసీ పీఠం వరించింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ జాబితా విడుదల చేసింది. ఏలూరు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రాజనాల రామ్మోహన్‌రావును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏఐసీసీ పరిశీలకులు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజక వర్గాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ చేశా రు. అనేక మంది డీసీసీ పీఠం తమకు కేటా యించాలంటూ దరఖాస్తులు అందజేశారు. రాజనాల కాంగ్రెస్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడిగా, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పదవులు నిర్వర్తిం చారు. ఇప్పటికే రెండుసార్లు డీసీసీ అధ్య క్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యా వంతుడు, సీనియర్‌ రాజకీయ నేత, కాంగ్రెస్‌ పార్టీలో అపార అనుభవం, అందరితో కలుపు గోలుగా ఉండి, పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండే నాయకుడిగా ఆయన పేరు పొందారు. మూడో సారి ఎన్నిక కావడం పట్ల రాజనాల మాట్లాడుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఏఐసీసీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని రాజనాల పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజనాలను అభినందించారు.

Updated Date - Jan 04 , 2026 | 12:59 AM