Share News

వర్షం ఊరట..!

ABN , Publish Date - May 28 , 2026 | 12:40 AM

గడిచిన 15 రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఊరటనిస్తూ మంగళవారం రాత్రి పది తర్వాత ఊహించని విధంగా ఉరు ములు, మెరుపులు, పిడుగులతో ఆకస్మాత్తుగా వర్షం కురిసింది.

వర్షం ఊరట..!
నరసాపురంలో నీట మునిగిన మెయిన్‌రోడ్‌

ఈదురుగాలులకు కూలిన చెట్లు.. విద్యుత్‌ స్తంభాలు

యలమంచిలిలో అత్యధికం.. రాత్రంతా పవర్‌ కట్‌.. జనం అగచాట్లు

భీమవరం టౌన్‌/నరసాపురం/పాలకొల్లు అర్బన్‌/ఆచంట/యలమంచిలి/మొగల్తూరు, మే 27(ఆంధ్రజ్యోతి): గడిచిన 15 రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఊరటనిస్తూ మంగళవారం రాత్రి పది తర్వాత ఊహించని విధంగా ఉరు ములు, మెరుపులు, పిడుగులతో ఆకస్మాత్తుగా వర్షం కురిసింది. గాలులకు పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు పడిపోయాయి. జిల్లాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో పూర్తిగా అంధకారం అలముకుంది. తెల్లవారుజాము వరకు ఉరుములు, పిడుగుల శబ్ధాలకు పడుకున్న చిన్నలు, పెద్దలు ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున మూడు గంటల సమయానికి వాతావరణం మారడంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా పునరుద్ద రించారు. జిల్లాలో అత్యధికంగా యలమంచిలి లో 80.4 మిల్లిమీటర్లు, నరసాపురంలో 65.6, పాలకొల్లు 60.2, తణుకు 2.4, భీమవరం 8.6, అత్తిలిలో 3.2, గణపవరం 2.8, పాలకోడేరు 36.4, పెనుమంట్ర 22.6, ఇరగవరం 10.6, పెనుగొండ 2.8, ఆచంట 15.2, పోడూరు 26.2, వీర వాసరం 50, మొగల్తూరులో 38.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రోడ్లపై వర్షం నీరు.. జనం అగచాట్లు

నరసాపురంలో నాలుగు గంటలపాటు కురిసి న భారీ వర్షానికి రోడ్లన్నీ కాలువలను తలపిం చాయి. ఈదురుగాలులకు చెట్ల కొమ్ములు నేలకొ రిగాయి. విద్యుత్‌ వైర్లు తెగాయి. విద్యుత్‌ సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వాతావరణం ఒక్కసా రిగా చల్లబడటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నా రు. రోడ్లపై సందడి కనిపించింది. పాలకొల్లులో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పిడుగులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సుమారు ఆరు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలురోడ్లపై గోతుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బం దులుపడ్డారు. డ్రెయిన్లు ఎగదన్నడంతోపాటు నీరు రోడ్లపైకి చేరింది. రోడ్లన్నీ ఛిద్రంగా మారా యి. రాత్రంతా వర్షం కురిసినప్పటికి బుధవారం ఎండ తీవ్రత తగ్గలేదు. ఆచంట మండలంలో ఈదురు గాలులతో మబ్బులు మేఘాలు అక్కడక్కడ జోరు వాన కురవడంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. బుధవారం వాతావరణం కాస్త చల్లబడినప్పటికి వేడి మాములుగానే ఉంది. యలమంచిలి మం డలంలో ఉరుములు, ఈదురుగాలులు, భారీ వర్షానికి పలు గ్రామాల్లో 25 విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. పెదపాలెం ప్రాంతంలో విద్యుత్తు స్థంభాలు పడిపోవడంతో బుధవారం సాయంత్రానికి కరెంటు సరఫరా పునరుద్దరించ కపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మొగల్తూరు మండలంలో ఉరుములు, మెరుపు లతో 30 నుంచి 40 సార్లు పెద్ద ఎత్తున పిడుగు లు పడుతున్న శబ్దం రావడంతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురయ్యారు. పలు గృహల్లోని ఫ్యాన్‌లు కాలిపోయాయి. మొగల్తూ రు వర్ధమానవారివీధిలో ఒక ఇంటిపై తాడి చెట్టు పడటంతో భవనం పైకప్పు దెబ్బ తినడం తోపాటు ఇంటి ప్రహరీ పూర్తిగా కూలిపోయింది. ఈదురు గాలులుకు మామిడి పండ్లు రాలిపో యాయి. వీటిని ఉదయాన్ని సంతకు తీసుకు వచ్చి అయినకాడికి అమ్ముకున్నారు.

Updated Date - May 28 , 2026 | 12:40 AM