వాన మొదలైంది..
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:58 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వానలు మొదలయ్యాయి. మంగళవారం ఉద యం నుంచి మబ్బుల వాతావరణం ఉన్నా సాయంత్రం నుంచి జోరువాన కురుస్తోంది.
వాన మొదలైంది..
అల్పపీడనంతో ఉదయం నుంచి మబ్బులు.. సాయంత్రానికి వర్షాలు
నాలుగైదు రోజులకుపైగా
కొనసాగే అవకాశం
(ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వానలు మొదలయ్యాయి. మంగళవారం ఉద యం నుంచి మబ్బుల వాతావరణం ఉన్నా సాయంత్రం నుంచి జోరువాన కురుస్తోంది. అల్పపీడన ప్రభావం ఐదు రోజులపాటు జిల్లాపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటి వరకు సూపర్ ఎల్‌నినో ప్రభా వం కారణంగా జిల్లాలో ముదినేపల్లి మండలం మినహా మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతా లు నమోదయ్యాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఇప్పటి వరకు కలిపి మైనస్ 46.63 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భజలాలు అడుగంటడంతో వ్యవసా య బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. ఫలి తంగా సాగు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పుడు అల్పపీడనం కారణంగా గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా దెం దులూరు మండలంలో 9.4 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కలిదిండి 5.4, వేలేరుపాడు 4.4, ఆగిరిపల్లి 2.8, జీలుగుమిల్లి 1.8, పెదవేగి 1.2, ఏలూరు 1 మి.మీ వర్షపాతం నమోదైంది.
కడలి కల్లోలం
నరసాపురం: తుఫాన్ ప్రభావంతో నరసాపు రం, మొగల్తూరు మండలాల్లోని సముద్రం అల్ల కల్లోలంగా మారింది. వాయుగుండంగా మారి తీరం దాటే సమయంలో పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్న హెచ్చరికతో అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి సముద్రంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. మత్స్యశాఖ అధికారులు వే టకు వెళ్లిన బోట్లను వెనక్కి రప్పిస్తున్నారు. 26 వరకు వేటకు వెళ్లద్దని హెచ్చరించారు.
ఆక్వాకు.. వాయు గండం
కలిదిండి: వర్షాల కారణంగా ఆక్సిజన్ కొరతతో చెరువుల్లోని రొయ్యలు చనిపోతున్నా యి. వీటిని హడావిడిగా పట్టుబడి చేసి ఏలూ రు, ఆకివీడు మార్కెట్‌లో అయినకాడికి అమ్ము తున్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టాల బారిన పడుతున్నారు. కొండంగి ఎత్తిపో తల పథకాల ద్వారా ఉప్పుటేరులో తీపి నీటిని సరఫరా చేస్తున్నప్పటికి పలు గ్రామాల్లో తాగు నీటి కొరత ఉండటంతో చేపల, రొయ్యల చెరు వుల్లో నీరు కనిష్ట స్థాయిలో ఉండటంతో చేపల ఎదుగుదల లోపించి పెట్టుబడి వ్యయం అధిక మవుతోందని రైతులు వాపోతున్నారు. లంక గ్రామాలతోపాటు ఎగువన ఉన్న పడమటిపా లెం, సానారుద్రవరం, ఎస్‌ఆర్‌పీ అగ్రహారం, కో రుకొల్లు, గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా నీటి సర ఫరా చేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. చెరువుల్లో నిరంతరం ఏరియేటర్లు తిప్పాలని మత్స్యశాఖాధికారి వి.శ్రీనివాస్ తెలిపారు.