Share News

పగలు ఎండ.. రాత్రి వాన

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:34 AM

జిల్లా వ్యాప్తంగా బుధవారం పగలు అత్యంత తీవ్రకరమైన వేడిగాలులతో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాత్రి ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది.

పగలు ఎండ.. రాత్రి వాన
ఏలూరులో కురుస్తున్న భారీవర్షం

(ఏలూరుసిటీ– ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా బుధవారం పగలు అత్యంత తీవ్రకరమైన వేడిగాలులతో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాత్రి ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏలూరు, పెదపాడు, జంగా రెడ్డిగూడెంలలో కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జల మయం అయ్యాయి. కాగా ఉదయం జిల్లాలోని నాలుగు మండలాల్లో అత్యంత తీవ్రకరమైన వేడిగాలులు వీయడంతో పాటు వడగాడ్పుల జోరు కొనసాగింది. దీనికి తగ్గట్టుగా ఉక్కబోత పెరగడంతో జిల్లాలోని ప్రజలు విలవిలడారు. అత్యధికంగా చింతలపూడి మండలంలో 44.2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నమోదైంది. ఈనెల 12న ఒక మండలంలో తీవ్రకరమైన వేడిగాలులు వీస్తాయని రాష్ట్ర విప త్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - Jun 11 , 2026 | 12:34 AM