నేటి నుంచి భుజబలపట్నం–నరసాయిపాలెం రైల్వేగేటు మూసివేత
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:22 AM
కైకలూరు–ఆకివీడు రైల్వేమార్గంలో కైకలూరు మండలం భుజబలపట్నం నుండి నరసాయిపాలెం వెళ్లే రహదారిలోని రైల్వేగేట్ నెంబర్ 88 మరమ్మతుల కొరకు ఈ నెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే ఇంజనీరింగ్ అధికారి ఎండీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు.
కైకలూరు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): కైకలూరు–ఆకివీడు రైల్వేమార్గంలో కైకలూరు మండలం భుజబలపట్నం నుండి నరసాయిపాలెం వెళ్లే రహదారిలోని రైల్వేగేట్ నెంబర్ 88 మరమ్మతుల కొరకు ఈ నెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే ఇంజనీరింగ్ అధికారి ఎండీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రజలు, ఆక్వారైతులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలన్నారు.