Share News

ఎట్టకేలకు కదిలారు..

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:55 PM

రాష్ట్ర రోడ్లు, భవ నాలశాఖ ఏలూరు సర్కిల్‌ పరిధిలోని వివిధ కేడర్లలోని ఉద్యోగులు వర్క్‌ ఎరేంజ్‌మెంట్‌ పేరుతో తమకు అనుకూల స్థానాల్లో కొనసాగుతున్న వారి ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.విజయరత్నం గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

 ఎట్టకేలకు కదిలారు..

ఆర్‌అండ్‌బీలో 18 మంది వర్క్‌ ఎరేంజ్‌మెంట్‌ ఉత్తర్వుల రద్దు

పాత స్థానాల్లో కొనసాగాలంటూ ఎస్‌ఈ ఉత్తర్వుల జారీ

ఏలూరు,అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవ నాలశాఖ ఏలూరు సర్కిల్‌ పరిధిలోని వివిధ కేడర్లలోని ఉద్యోగులు వర్క్‌ ఎరేంజ్‌మెంట్‌ పేరుతో తమకు అనుకూల స్థానాల్లో కొనసాగుతున్న వారి ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.విజయరత్నం గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ‘కదిలేది.. లే’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 7న బుధవారం ప్రచురిత మైన కథనానికి స్పందన వచ్చింది. మొత్తం 18 మంది వర్క్‌ ఎరేంజ్‌మెంట్‌ కింద తమకు అనుకూలమైన స్థానాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించిన ఎస్‌ఈ వారిని ఎట్టకేలకు కదుపుతూ వెంటనే తమ ఒరిజనల్‌ స్థానా ల్లోకి వెళ్లిపోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 18 మందిలో 11 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఒక టైపిస్ట్‌, ఒక గాంగ్‌మజ్దూర్‌, ఒక అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉన్నా రు. ఒరిజనల్‌ స్థానాలకు వెళ్లాల్సిన వారిలో భీమవరం, రాజమండ్రి, విజయవాడ, తాడే పల్లిగూడెం, పెనుగొండ, జంగారెడ్డిగూడెంలకు చెందినవారు అత్యధికంగా ఉన్నా రు. ఏలూరు సర్కిల్‌ కార్యాలయంలో ఇద్దరు, ఏలూరు డివిజన్‌ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:55 PM