పుష్కర ఘాట్లను శుభ్రం చేయండి
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:17 AM
వినాయక చవితి ఈనెల14వ తేదీన పురస్కరించుకుని ఆచంట మండల వ్యాప్తంగా పదిరోజులు పాటు వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి.
వినాయక చవితి సందర్భంగా రేవులపై శ్రద్ధ వహించాలని విన్నపం
ఆచంట, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఈనెల14వ తేదీన పురస్కరించుకుని ఆచంట మండల వ్యాప్తంగా పదిరోజులు పాటు వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. ఈ పది రోజుల పాటు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమలను గ్రామాల్లో ఊరేగించి నిమజ్జనం చేస్తారు. ఎక్కువ మంది సమీపంలో ఉన్న గోదావరిలో స్వామి వారి విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఆచంట మండలంలో ఉన్న కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం, పుష్కరఘాట్‌లు ప్రస్తుతం మట్టితో నిండి ఉన్నాయి. గతంలోనే ఈ పుష్కరఘాట్‌లు మట్టితో నిండి ఉండగా ఇటీవల వచ్చిన గోదావరి వరదకు ఈ ఘాట్‌ల్లో మరింత మట్టి చేరి రేవులన్నీ కప్పబడి ఉన్నాయి. వినాయకచవితి ఉత్సవాలు పురస్కరించుకుని స్వామి వారి విగ్రహాలను నిమజ్జనం చేసే నిమిత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మండలంలో ఉన్న పుష్కరఘాట్‌లను అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి శుభ్రం చేయించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.