Share News

రూ.2,310 కోట్లు ఇవ్వండి

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:09 AM

మహాకుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేసింది. ఆ మేరకు జిల్లాలో రూ.2,310 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

రూ.2,310 కోట్లు ఇవ్వండి

గోదావరి పుష్కరాలకు జిల్లా అధికారుల ప్రతిపాదనలు

పరిపాలనా అనుమతుల కోసం అంచనాలు

శాఖల వారీగా ప్రణాళికలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మహాకుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేసింది. ఆ మేరకు జిల్లాలో రూ.2,310 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతుల కోసం జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రతిపాదనలు పంపారు. రహదారులు భవనాల శాఖ, జలవనరులు, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ శాఖల నుంచే అత్యధికంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పుష్కర్‌ ఘాట్‌లు, ఇతర వసతులు కల్పించనున్నారు. గడచిన పుష్కరాల్లోనూ గోదావరి తీరంలో పుష్కర ఘాట్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లాకు రవాణా వసతులు మెరుగ య్యాయి. జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయి. ఫలితంగా పుష్కర స్నానాలకు అధిక సంఖ్యలో వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఘాట్‌ల పునరుద్ధరణ, కొత్త ఘాట్‌ల ఏర్పాటు, వాటికి అనుసంధానంగా రహదారుల అభివృద్ధి కోసం అంచనాలు రూపొందించారు. జిల్లాలో అవసర మైన సీసీ, బీటీ రహదారులు ఏర్పాటు చేయనున్నారు.

81 ఆలయాల అభివృద్ధి

పుష్కరాల్లో భాగంగా జిల్లాలోని 81 దేవాలయా లను అభివృద్ధి చేయనున్నారు. దేవాలయాల సందర్శన కోసం రహదారులు పునర్నిర్మానికి, పునరుద్ధరణకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద వసతులను మెరుగు పరచనున్నారు. జిల్లా మీదుగా పుష్కర ఘాట్‌లకు వెళ్లేందుకు ప్రఽధాన రహ దారులు, వంతెనలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోను న్నారు. జిల్లాలోని మౌలిక వసతులు కల్పించే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. పోలీస్‌, ఆర్టీసీ ఇతర శాఖల నుంచి తమకు అవసరమయ్యే నిధులను ప్రతి పాదిం చారు. పుష్కర ఘాట్‌ల వద్ద ఆటలు, చిన్నపిల్లలు వినోదానికి అవసరమైన ఏర్పాట్లను పర్యాటక శాఖ కల్పించనుంది. ఆ దిశగానే అంచనాలు రూపొందించారు. పుష్కరఘాట్‌ల వద్ద పారిశుఽధ్య నిర్వహణ, నదీ తీర మండలాల్లో విద్యుత్‌ సౌకర్యానికి అంతరాయం లేకుండా సబ్‌స్టేషన్ల అభివృద్ధి, కొత్తవి ఏర్పాటు చేసే దిశగానూ అడుగులు వేస్తున్నారు. గోదావరి పుష్కరాల కోసం మౌలిక వసతులు, రహదారులు, భక్తులకు సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి వంటి పనులకు దాదాపు రూ.2,310 కోట్లు అవసరమని అంచనా వేశారు. పరిపాలన అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు.

శాఖలవారీగా అంచనాలు ఇలా..

ప్రతిపాదనలు పనులు నిధులు

పంపిన శాఖ (రూ. కోట్లలో)

జలవనరుల శాఖ ఘాట్‌లు, రహదారులు 681.24

పంచాయతీరాజ్‌ రహదారులు, నివాస వసతులు 580.54

ఆర్‌అండ్‌బీ రహదారులు, వంతెనలు 399.60

మున్సిపల్‌ శాఖ రహదారులు, సుందరీకరణ, 522.75

విద్యుత్‌ లైన్‌ల బలోపేతం, ట్రాన్స్‌ఫార్మర్లు 62,26

వైద్య, ఆరోగ్య యాత్రికులకు వైద్యం, మందులు 18.69

దేవదాయ ఆలయాల అభివృద్ధి 11.34

పర్యాటకం వసతులు, వినోదం 10.34

పోలీస్‌ ట్రాఫిక్‌ నియంత్రణ 6.95

గ్రామీణ నీటిపారుదల మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పాటు 6.53

విపత్తుల నివారణ సిబ్బంది, అగ్ని నివారణ పరికరాలు 5.38

మత్స్యశాఖ ఈతగాళ్లు, బోట్లు, సౌకర్యాలు 5.07

ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద సౌకర్యాలు 3.80

Updated Date - Apr 12 , 2026 | 12:09 AM