Share News

పుష్కర నిధులొచ్చాయ్‌..

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:35 AM

పుష్కర నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు పురపాలక సంఘాలకు తొలి విడతగా రూ.20 కోట్లు ప్రకటించింది.

పుష్కర నిధులొచ్చాయ్‌..

నరసాపురం, జూలై 5(ఆంధ్రజ్యోతి): పుష్కర నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు పురపాలక సంఘాలకు తొలి విడతగా రూ.20 కోట్లు ప్రకటించింది. ఈ మొత్తంలో నరసాపురం రూ.15 కోట్లు, పాలకొల్లు పురపాలక సంఘా నికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ముఖ్యమైన పనులకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రక టించారు. నరసాపురం పురపాలక సంఘం మొత్తం 201 పనులకు ప్రతిపాదనలు పంపింది. ఈ పనులకు సుమారు రూ.191 కోట్లు ఖర్చు అవుతుందని తెలియజేసింది. ప్రతిపాదించిన పనుల్ని మూడు విడ తలుగా చేపడతామని పేర్కొంది. వాటిల్లో ప్రాఽథమికంగా చేపట్టే 88 పనులకు సుమారు రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని నివేదించింది. ఈ పనుల్లో పుష్కర ఘాట్‌లకు వెళ్లే రహదార్లు, డ్రైన్లు, లైటింగ్‌, పైపులైన్‌, సుందరీకరణ వంటి పనులకు సంబంధించినవే ఉన్నాయి. నిధులు కేటాయించడంతో ముఖ్యమైన పనులు చేపట్టేందుకు ఇంజ నీరింగ్‌ అధికారులు రెడీ అవుతున్నారు.

పుష్కరాలకు 80 బస్సులు

నరసాపురం, భీమవరం డిపోలకు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం జిల్లా ఆర్టీసీ 80 కొత్త బస్సులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో నరసాపురం డిపోకు 40, భీమవరం డిపోకు 40 చొప్పున కేటాయించా లని నివేదించారు. అత్యధిక మంది యాత్రికులు పుష్కర స్నానాలు చేసేందుకు నరసాపురం వస్తుంటారు. జిల్లా కేంద్రం భీమవరం నుంచి కూడా అధిక సంఖ్యలో నరసాపురం, రాజమండ్రి వెళుతుంటారు. ప్రస్తుతం ఉన్న బస్సులు కాకుండా అదనంగా కొత్త బస్సుల కేటాయిస్తే వచ్చే యాత్రీకులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా సర్వీసులు నడపాలని నిర్ణయిం చారు. ప్రధానంగా రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, ఉమ్మడి జిల్లాలోని టీపీగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత పుష్క రాలకు నరసాపురానికి సుమారు 50 లక్షల మంది విచ్చేశారు. ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా సర్వీసులు కేటాయించాలని నివేదించారు. ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీకి డిజిల్‌ కాకుండా ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంతో పుష్కరాలకు కూడా ఈవీ బస్సులు కేటాయిస్తారని అధికారులు భావిస్తున్నారు. వీటికి అనుగుణంగా డిపోల్లో చార్జింగ్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:35 AM