Share News

మలి విడత పురపోరు పోలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:54 AM

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జరిగిన భీమవరం మునిసిపాల్టీ ఎన్నికల్లో గురువారం పోలింగ్‌లో ఉదయం నుంచి పోలింగ్‌ కొంత మందకొడిగా సాగినప్పటికీ ప్రశాంతంగా ముగి సింది.

మలి విడత పురపోరు పోలింగ్‌ ప్రశాంతం

భీమవరం మునిసిపాల్టీలో 62.72 శాతం

భీమవరంటౌన్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జరిగిన భీమవరం మునిసిపాల్టీ ఎన్నికల్లో గురువారం పోలింగ్‌లో ఉదయం నుంచి పోలింగ్‌ కొంత మందకొడిగా సాగినప్పటికీ ప్రశాంతంగా ముగి సింది. పట్టణంలోని 52 వార్డుల్లో నిర్వహించిన పోలింగ్‌ 62.72 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం 1,45,738 మంది ఓటర్లు ఉండగా, 91,412 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొలుత మందకొడిగా సాగిన పోలింగ్‌ క్రమంగా ఊపందుకుంది. ఈసారి చాలావార్డుల్లో ఎన్నికల హడావుడి అంతగా కనిపించలేదు. నామమాత్రంగా పోలింగ్‌ సాగినట్లు కనిపించింది. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవ డంతో అక్కడ మా త్రం కొంత హడావుడి కనిపించింది. కూటమి నాయకులు చురుగ్గా వ్యవహరించిన వార్డుల్లో రాజకీయ వాతావరణం కొంత వేడెక్కింది.

యువతలో కనిపించని ఆసక్తి

సార్వత్రిక ఎన్నికల్లో కనిపించే ఉత్సాహం మున్సిపల్‌ ఎన్నికల్లో యువత కనపరచలేదు. చదువు, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లిన యువత ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తోంది.

మునిసిపాల్టీలకు చేరుకున్న బ్యాలెట్‌ బాక్సులు

పోలింగ్‌ ముగిసిన తరువాత ఎన్నికల అధికారులు అభ్యర్థుల సమక్షంలో సీల్స్‌ వేసి బ్యాలెట్‌ బాక్సులను మునిసిపాల్టీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. వారికి కేటాయించిన వాహనాల ద్వారా మునిసిపాల్టీకి అందించడంతో అధికారులు ఆయా బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లో భధ్రపరిచారు. ఈనెల 30న కౌంటింగ్‌ జరగనుంది.

తణుకులో 64.03 శాతం..

తణుకు : తణుకులో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ గురువాం ప్రశాంత వాతావరణంలో జరిగింది. మొత్తంగా 64.03శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. పట్టణంలో 75,465 మంది ఓటర్లు ఉండగా వారిలో 48,324మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన సుమారు 27 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. మొత్తం ఓటర్లలో సుమారు మూ డింట రెండొంతులు మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు.

తాడేపల్లిగూడెం మునిసిపాల్టీలో 65.2 శాతం

8 రెండు, మూడు కేంద్రాల వద్ద చిన్నపాటి ఘర్షణలు

తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం పట్టణంలో గురువారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలో 1,00,728 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అనువుగా 110 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు, పోలీస్‌ బలగాలు మోహరింపు, పటిష్ట భద్రత మధ్య అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు బలగాల ఏర్పాటుతో ప్రశాంతంగా జరిగాయి.

ఫ 33, 43వ వార్డుల్లో చిన్నపాటి ఘర్షణలకు దారితీశాయి. వీటిని అక్కడ ఉన్న నాయకులు సర్దిచెప్పడంతో సమసిపోయాయి.

పాలకొల్లులో 69.52శాతం పోలింగ్‌..

పాలకొల్లు అర్బన్‌ : పాలకొల్లు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగి సిందని ఎన్నికల అధికారి, కమిషనర్‌ డి.కిరణ్‌కుమార్‌ తెలిపారు. 12 ఏళ్ళ అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో 2014లో 31వార్డులుగా ఎన్నికలు జరిగాయి. తిరిగి 2026లో విలీన గ్రామాలతో కలిపి 44 వార్డులుగా ఎన్నికలు జరిగాయి. చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 38వ వార్డు కౌన్సిలర్‌ పదవి ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నిక జరగలేదు. ఈమేరకు 43 వార్డులకే ఎన్నిక జరిగింది. ఎల్‌ఆర్‌పేట ఎం.గరువు స్కూల్లో ఓటు హక్కును మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, టీడీపీ చైర్మన్‌ అభ్యర్థిని ఆబోతుల ఉషారాణి తన భర్త వెంకటేశ్వరరావుతో కలిసి డీఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇండిపెండెంట్‌ చైర్మన్‌ అభ్యర్థిని కర్నేన రోజారమణి, గౌరునాయుడు దంపతులు టీవీఆర్‌, ఎస్‌కేపీ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చింతలపూడిలో 66.03 శాతం

చింతలపూడి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు జిల్లాలో మలివిడత పురపోరు ఎన్నికలలో చింతలపూడి నగర పంచాయతీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగ లేదు. ఉదయం ఏడు గంటలకే కొన్ని బూత్‌లలో ఓటర్లు బారులు తీరారు. మూడో వార్డులో ఒక్కసారిగా ఓటర్లు అధికంగా రావడంతో క్యూ పెరిగి అధికారులు అప్రమత్తమయ్యారు. పోలింగ్‌ ముగిసేనాటికి 66.03 శాతంగా నమోదైంది. నగర పంచాయతీలో ఓటర్లు 22,738 కాగా, 23వార్డులు, 23 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం వీల్‌చైర్‌లను ఏర్పాటు చేశారు. చంటి పిల్లలతో మహిళలు తమ ఓటును వినియోగించుకున్నారు. వికలాంగులు, వృద్ధులు పాముల సత్యనారాయణ, కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ఏడో వార్డులో ఓటు వేయించారు. నాగిరెడ్డి స్వరాజ్యలక్ష్మి అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులు మోటారు సైకిల్‌ మధ్యలో కూర్చోబెట్టి తీసుకువచ్చి ఓటు వేయించారు. నరం సత్యనారాయణ అనే వృద్దుడిని మోటారు సైకిల్‌పై తీసుకువచ్చి 11వ వార్డులో ఓటు వేయించారు. 18వ వార్డులో ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూ లేకుండా ప్రశాతంగా ఓటు వేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోను, మధ్యాహ్నం మరోసారి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ నగర పంచాయ తీలోని అన్ని వార్డులలో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. మొత్తం 15,014 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత బ్యాలెట్‌ బాక్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముకు తరలించినట్టు మునిసిపల్‌ కమిషనర్‌ అంబటి రాంబాబు తెలిపారు. చైర్‌పర్సన్‌ పోటీలో టీడీపీ అభ్యర్థిని కంభం ఎస్తేరురాణి, వైసీపీ అభ్యర్థిని పెదగర్ల సునీత, కాంగ్రెస్‌ అభ్యర్థిని మల్లెల పద్మ, స్వతంత్ర అభ్యర్థిని మునుకుమాటి సునీత ఉన్నారు. 23 వార్డులలో పదో వార్డులో అత్యధికంగా 80.46 శాతం పోలింగ్‌ నమోదైంది. 23వ వార్డులో అత్యల్పంగా 51.55 శాతం పోలింగ్‌ జరిగింది.

Updated Date - Nov 27 , 2026 | 12:55 AM