Share News

1,66,693 మందికి పోలియో చుక్కలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:17 AM

పల్స్‌ పోలియో కార్యక్రమంలో ఆదివారం జిల్లాలో 1,66,693 మందికి (95.02 శాతం) పోలియో చుక్కలు వేశారు.

1,66,693 మందికి పోలియో చుక్కలు
తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ నాగరాణి

జిల్లాలో 95.02 శాతం పూర్తి

భీమవరం టౌన్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : పల్స్‌ పోలియో కార్యక్రమంలో ఆదివారం జిల్లాలో 1,66,693 మందికి (95.02 శాతం) పోలియో చుక్కలు వేశారు.ఇంకా 4,371 మందికి పోలియో చుక్కలు వెయ్యవలసి ఉంది. వీరిని గుర్తించి వేసేందుకు సోమ, మంగళవారాలల్లో ఇంటింటికి వెళ్ళి పోలియోచుక్కలను వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 1,75,435 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా1,151 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 1,063 స్ధిర కేంద్రాలు, 52 మొబైల్‌ కేంద్రాలు, 36 ట్రాన్సిట్‌ బూత్‌లను ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ నాగరాణి తణుకులో ప్రారంభించగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉదయం 8 గంటల నుంచి పోలియో చుక్కలు వేసే ప్రారం భించి సాయంత్రం వరకు కొనసాగించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్‌

తణుకు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన, సత్వర వైద్యసేవలు అందేలా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. ఆదివారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించారు. రోగులను పలకరించి వారి ఆరోగ్య పరిస్దితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల విషయంలో సమస్యలు ఉంటే సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వైద్యులు దేవుడితో సమానంగా గౌరవిస్తారని, అలాంటి వృత్తిలో ఉన్న వైద్యులు రోగులను ఆప్యా యంగా పలకరించి మంచి సేవలందిం చాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డీసీహెచ్‌ఎస్‌ పి.సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌. సాయి కిరణ్‌, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:17 AM