Share News

నేడు మెగా పీటీఎం

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:44 AM

జిల్లావ్యాప్తంగా 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాలను నిర్వహించ డానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

నేడు మెగా పీటీఎం
ఏలూరు రూరల్‌ మండలం మానూరులో ఆహ్వాన పత్రికలను అందజేస్తున్న ఉపాధ్యాయులు

1,772 పాఠశాలలు, 20 జూనియర్‌ కళాశాలల్లో నిర్వహణ

విద్యార్థి సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యం

ఏలూరు అర్బన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాలను నిర్వహించ డానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే మెగా పీటీఎం 4.0 కార్యక్రమం మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తుంది. ప్రతి విద్యార్థికి సంబంధించిన ప్రోగ్రెస్‌ కార్డు, హాజరు వివరాలు, అభ్యసనా స్థాయిలు, ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌)పురోగతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేస్తారు. మెగా పీటీఎం 4.0కి హాజరుకావాల్సిందిగా తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠ శాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ)సభ్యులు, ప్రజా ప్రతినిధు లు, పూర్వ విద్యార్థులు, దాతలు, గ్రామపెద్దలకు ఇప్పటికే ఆహ్వానపత్రాలు అందజేశారు.

పేరెంట్స్‌ ఇద్దరూ రండి : కలెక్టర్‌

పాఠశాల–కుటుంబ సంబంధాలను పటిష్టపర్చడమే ప్రఽధాన లక్ష్యంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల లు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాలు జరగాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి సూచించా రు. మెగా పీటీఎం నిర్వహణపై గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మీటింగ్‌కు పేరెంట్స్‌ ఇద్దరూ హాజరై తమ పిల్లల అభ్యసనా సామర్థ్యా లను తెలుసుకోవాలని కోరారు. స్కూలు నిర్వహణలో తల్లిదం డ్రుల భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేం దుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. డీఈవో వెంకట లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికల అందజేత..

ఏలూరు రూరల్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): పిల్లల భవి ష్యత్‌ కోసం తల్లిదండ్రులు శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పేరెంట్‌ – టీచర్స్‌ మీట్‌’కు తప్పనిసరిగా పాఠశాలకు రావాలనే సందేశంతో ఏలూరు రూరల్‌ మండలం మానూరు లోని మండల ప్రజా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యా యులు వినూత్నంగా ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘బడి వైపు ఒక అడుగు – తల్లిదండ్రుల ముచ్చట్లు’ కార్యక్రమంలో ప్రతి తల్లి తండ్రి తప్పనిసరిగా పాల్గొని తమ పిల్లల చదువు, అభ్యాస పురోగతి, భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించాలని ప్రధానోపాధ్యా యులు తేరా ప్రసాద్‌ కోరారు.

మా పాఠశాల మెగా పీటీఎంకి రండి..

పెదపాడు: మా పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్‌– టీచర్స్‌ మీట్‌ని నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమానికి తప్ప కుండా హాజరు కావాలంటూ పెదపాడు హైస్కూల్‌ విద్యార్థి నులు గురువారం కలెక్టర్‌ వెట్రిసెల్విని కలిసి వారు రూ పొందించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్ప కుండా హాజరవుతానని కలెక్టర్‌ తెలిపారు. ఎంఈవో నరసింహా మూర్తి, హెచ్‌ఎం జి.విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:44 AM