Share News

మా గోడు వినండి మహా ప్రభో..

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:57 AM

జంగారెడ్డిగూడెం డిపో డ్రైవర్‌ బి.రామారావు అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు,జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపో కా ర్మికులు ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.

మా గోడు వినండి మహా ప్రభో..
ప్రజా సంఘాల నాయకుల ఆందోళనలు

మా గోడు వినండి మహా ప్రభో..

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ప్రజా సంఘాల నాయకుల ఆందోళనలు

ఏలూరురూరల్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెం డిపో డ్రైవర్‌ బి.రామారావు అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు,జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపో కా ర్మికులు ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. యూనియన్‌ జోనల్‌ కార్యదర్శి వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ 1/19 సర్క్యులర్‌ ను అమలు చేసే వరకు పోరాటం కొనసాగి స్తామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చై ర్మన్‌ కె.రమేశ్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి బి.రాం బాబు మాట్లాడుతూ రామారావు సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకు మద్దతు ఉంటుందన్నారు. అనంతరం డిప్యూటీ ఆర్డీవో ఎస్‌.కె. షబ్నంకు వినతిపత్రం అందజేశారు. చర్చలు ఫలించక పోవడంతో బుధవారం నుంచి కలెక్టరేట్‌ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపడతామని తెలిపారు. కె.వి.రాఘవులు, టి.బాబూరావు, డి.ఆంజనే యులు, ఎం.ఎస్‌.రావు, మల్లి పాల్గొన్నారు.

వీఎస్‌ఎస్‌ అవకతవకలపై..

లింగపాలెం మండలం వేములపల్లి అటవీ సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్‌)లో జరిగిన అవ కతవకలపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. 1992లో 300 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన వీఎస్‌ ఎస్‌ ద్వారా అటవీ భూమిలో మొక్కలు నాటి సంరక్షించినట్టు వీఎస్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు చేబత్తుల వెంకటరత్నం తెలిపారు. అనంతరం జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్‌, కె.శోభన్‌ బాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు స ముద్రాల సుందరరావు,బోడా ఏసు పాదం, తాళం సత్యనారాయణ, పి.రమేశ్‌, బి రత్తమ్మ, నత్తా జయమ్మ పాల్గొన్నారు.

కరువు నివారణ చర్యలు చేపట్టాలి..

బుట్టాయగూడెం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రాష్ర్టాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ధీర్ఘకాలిక కరువు ని వారణ చర్యలు చేపట్టాలని అఖిలభారత రైతు కూలీ సంఘం(ఎఐకెఎంఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు టి.సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. అనంతపు రంలో జరిగిన రాష్ట్ర మహా సభలో రాష్ర్టాధ్య క్షుడిగా ఎన్నికైన సుధాకర్‌ మంగళవారం బుట్టా యగూడెం రామనర్సయ్య భవనంలో రాష్ట్ర మహాసభ తీర్మానాలను విలేకరులకు వివరిం చారు. కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 22, 23 తేదిల్లో రాష్ట్ర వ్యా ప్తంగా మండల, డివిజన్‌ కేంద్రాల్లో ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు, చింతల పూడి ప్రాంతాల్లో భూగర్భ బొగ్గును లిక్విడ్‌ రూపంలో తీయాలనే చర్యలను చాలా దేశాలు నిషేధించాయని, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణ విపత్తు, పంటల వినాశనం జరు గుతుందని ప్రతిపాదనలను ఉపసంహరించు కోవాలన్నారు.రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ నిలిపి వేయాలన్నా రు. నాయకులు పి.శ్రీనివాస్‌, కారం రాఘవ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:57 AM