నిరసనల హోరు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:05 AM
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు బుధవారం నిరసనల తో హోరెత్తాయి. అంగన్వాడీలు తమ సమస్యల్ని పరిష్క రించాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిల బడి నిరసన తెలపగా భీమవరం లోని ప్రకాశం చౌక్ వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపా రు.
మోకాళ్లపై నిలబడి అంగన్వాడీల దీక్షలు
వేధింపుల అధికారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వోల ఆందోళన
ఇళ్ల మధ్య బార్ వద్దంటూ రహదారిపై బైఠాయించిన మహిళలు
భీమవరం కలెక్టరేట్ వద్ద విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
ఖాళీలు భర్తీ చేయాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం నిరసన
సీఎం సార్ మా గోడు వినండి..
ఏలూరు రూరల్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి):
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు బుధవారం నిరసనల తో హోరెత్తాయి. అంగన్వాడీలు తమ సమస్యల్ని పరిష్క రించాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిల బడి నిరసన తెలపగా భీమవరం లోని ప్రకాశం చౌక్ వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపా రు. గతంలో తాము అడ్డుకున్నా మరలా బార్ ఏర్పాటు కు సన్నాహాలు చేస్తు న్నారంటూ ఏలూరు దక్షిణపు వీధి వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విఽధుల పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని బుట్టాయగూడెంలో వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలంటూ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసింది. విద్యుత్ మీటర్ల రీడర్స్‌కు ఎస్ర్కో ఎక్కౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలంటూ భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి జేసీకి వినతిపత్రం అందించారు.
సీఎం సార్ మాగోడు వినండి.. హామీ నిలబెట్టుకోండి అంటూ అంగన్‌వాడీ వర్కర్లు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూని యన్ ఆధ్వర్యంలో వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో రెండోరోజు బుధవారం మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. ఆరేళ్లుగా అంగన్‌వాడీ లకు ఒక్కరూపాయి కూడా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల పూర్తిగా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు రమాదేవి, రంగమ్మ, విజయలక్ష్మి, దుర్గ, ఆదిలక్ష్మి, మల్లిక, రేవతి, నవతి, సీఐటీయూ నాయకులు ఎం. ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం టౌన్: పేదరికాన్ని గుర్తించకుండా పాల కులు నటిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజా రామ్మోహన్‌రాయ్ ఆరోపించారు. బుధవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అంగన్‌వాడీల వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే దీక్షలను ఆయన ప్రారం భించి మాట్లాడుతూ దేశంలో అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని వేతనాలు దారుణంగా పడి పోయాయ న్నారు. అంగన్‌వాడీల సంఘం జిల్లా నాయకులు కే ఝాన్సీ లక్ష్మి, ఎండీ హస్సేన్ మాట్లాడారు. ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి లక్ష్మి, లారెన్స్ కుమారి మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా నాయ కులు ఎం.ఆంజనేయులు, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు పి. నాగరత్నం, శ్యామల రాణి, రామకోటి, తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల మధ్య బార్ వద్దు..
ఏలూరు: నగరంలో పలు డివిజన్ల ఇళ్ల మధ్య గల దక్షిణపువీధి చిరంజీవి బస్‌షెల్టర్ సమీపంలో బార్ ఏర్పాటు చేయవద్దంటూ ప్రజా సంఘాలు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. స్థానికంగా టెంట్ వేసుకుని నిరసన చేపట్టారు. చాలాకాలం క్రితం ఇక్కడే మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని అడ్డుకున్నామని... ఇటీవల బార్ ఏర్పాటుకు అనుమతి తెచ్చుకుని, రాత్రి వేళ్లలో కంటైనర్ దించి, సరుకు తెచ్చుకోవడాన్ని గుర్తించిన మహిళలు అక్కడకు చేరుకుని నిర్వాహకులను నిలదీసినట్లు సమాచారం. కాగా బుధవారం ఉదయం వివిధ సంఘాల నేతలు పుప్పాల కన్న బాబు, నగిరెడ్డి నరేష్, కోన మాణిక్యం, రంగముత్యాలు, చెల్లాయమ్మ తదితరుల ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. పలు కాలనీలు, ఆలయాలకు, వెళ్లే దారి ఇదేనని, ఉన్నతాధికారులు స్పందించి బార్ ఏర్పాటును నిలువరించాలని కోరారు.
వేధింపుల అధికారిపై చర్యలు తీసుకోవాలి : వీఆర్వోలు
బుట్టాయగూడెం: విఽధుల పేరుతో తీవ్ర వేధింపు లకు గురిచేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వోలు బుధవారం తహసీల్దార్ వద్ద ధర్నా చేశారు. కేవీపీఎస్ నాయకుడు అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడు తూ వీఆర్వోల పట్ల తహసీల్దార్ అవమానకరంగా మాట్లాడేవారని, దిగువ కులస్థులంటూ వేధించే వారని, మహిళా వీఆర్వోల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని ఆరోపించారు. వేధింపులకు గురి చేసిన అధికారిపై అట్రాసిటీ కేసు నమోదుచేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన
భీమవరం టౌన్: విద్యుత్ మీటర్ రీడర్లకు ఎస్ర్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని విద్యుత్ మీటర్ రీడర్ల జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఎస్ర్కో ద్వారా వేతనాలు చెల్లించాలని, విద్యుత్ శాఖ ఉన్నతా ధికారులు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా వేతనాల చెల్లింపులో పీఎఫ్, ఈఎస్‌ఐ అమలులో కాంట్రాక్టర్లు తీవ్ర అవినీతికి పాల్పడుతూ మీటర్ రీడర్లకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ భీమవరం డివిజన్ అధ్యక్షుడు పెనుమాక జాకబ్ మాట్లాడారు. తొలుత విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి ఇన్‌చార్జి ఏడీఈ కె.మధుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా వెళ్ళి ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఏజెన్సీలో పోస్టులు భర్తీ చేయాలి
వేలేరుపాడు: పదేళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఇబ్బం దులు ఏర్పడుతున్నాయని, ఖాళీలు భర్తీ చేయాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసి యేషన్ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగ సంఘం నాయకులు ఆందోళన చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు సున్నం శ్రీరాము లుదొర మాట్లాడుతూ ఏజెన్సీలో వైద్యులు, హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉండటంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై భారం పడుతోందన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే ఇబ్బందిగా ఉందని తెలిపారు. త్వరలో ప్రకటించబోయే జాబ్ క్యాలెండర్‌లో ఆదివాసీ ప్రాంతాల్లోని పోస్టులను స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రీజనల్ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.