Share News

లంకవాసుల కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:08 AM

కనకాయలంక గ్రామ స్తుల కష్టాలను తీర్చడానికే కాజ్‌వేపై వంతెన నిర్మాణం చేస్తున్నా మని ఇరిగేషన్‌ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

లంకవాసుల కష్టాలకు చెక్‌
కనకాయలంకలో కాజ్‌వేపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

కాజ్‌వేపై వంతెన నిర్మాణం

రూ.22.83 కోట్లతో పెదలంక, కనకాయలంక గ్రామాల్లో వంతెనకు మంత్రి నిమ్మల శంకుస్థాపన

పి.గన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కనకాయలంక గ్రామ స్తుల కష్టాలను తీర్చడానికే కాజ్‌వేపై వంతెన నిర్మాణం చేస్తున్నా మని ఇరిగేషన్‌ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో కనకాయ లంక, పెదలంక గ్రామాల్లో రూ.22.83 కోట్లుతో నిర్మించ నున్న వంతెన నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. కనకాయలంక, పెదలంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు శాశ్వతంగా తొలగించేలా కాజ్‌వేపై వంతెన నిర్మాణం చేపట్టామ న్నారు. ఈ వంతెన నిర్మాణం చాకలిపాలెం వద్ద వశిష్ట ఎడమ గట్టు నుంచి కనకాయలంక గ్రామం వరకు 354 మీటర్ల మేర వంతెన పొడువు ఉంటుందని తెలిపారు. అమరావతి రాజధానికి జగన్‌ వ్యతిరేకి అని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతికి ఆమోదం తెలిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేట్‌ పిరాయించడం జగన్‌ దగా కోరు విధానాలకు నిదర్శనమన్నారు. లంక గ్రామస్తులు భారీ గజమాలతో రామానాయుడిని సత్కరించారు. ఇరిగేషన్‌ గోదావరి డెల్టా సిస్టమ్‌ సీఈ .చినబాబు, ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ జి.శ్రీని వాసరావు, హెడ్‌వర్క్స్‌ ఈఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:08 AM