అక్షరం అండగా .. సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:37 AM
ప్రజల సమస్యలపై ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి అక్షర యుద్ధం చేస్తోంది.. నగరాల్లో ప్రధాన సమస్యలు ఉన్న వార్డులను ఎంపిక చేసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. అక్షరమే ఆయుధమై ప్రజల చెంతకే వెళుతోంది.. ఏలూరు 19వ డివిజన్ గ్రీన్‌సిటీలో తిష్ఠ వేసిన సమస్యల పరిష్కరానికి ‘ఆంధ్రజ్యోతి’ ముందడుగు వేసింది..
ఏలూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి):ప్రజల సమస్యలపై ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి అక్షర యుద్ధం చేస్తోంది.. నగరాల్లో ప్రధాన సమస్యలు ఉన్న వార్డులను ఎంపిక చేసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. అక్షరమే ఆయుధమై ప్రజల చెంతకే వెళుతోంది.. ఏలూరు 19వ డివిజన్ గ్రీన్‌సిటీలో తిష్ఠ వేసిన సమస్యల పరిష్కరానికి ‘ఆంధ్రజ్యోతి’ ముందడుగు వేసింది.. స్థానిక పార్కులో ఆదివారం ‘అక్షరం అండగా పరి ష్కారమే అజెండా’ కార్యక్రమం నిర్వహించింది. ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), కార్పొరేషన్ కో–ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, గ్రీన్‌సిటీ అభివృద్ధి కమిటీ అఽధ్యక్షుడు ఎస్‌ఎన్ రమేష్, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, మునిసిపల్ ఇంజనీర్ సురేంద్ర బాబు, ఏఈ సాయి పాల్గొన్నారు. గ్రీన్‌సిటీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. డ్రెయినేజీ అస్యవ్యస్తంగా ఉంది.. పార్కును అభివృద్ధి చేయండి.. ఖాళీ స్థలా లను బాగు చేయించండి.. చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదు.. కుక్కలు, పందుల సమస్య పరిష్కరించండి.. పార్కులో కరెంట్ సరఫరా చేయండి.. అంటూ సమస్యలు విన్నవించారు. ఎమ్మెల్యే సావధానంగా సమస్యలు విన్నారు.. పరిష్క రిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు.. గ్రీన్ సిటీలో పక్కా రోడ్ల నిర్మాణానికి కోటీ ఏడు లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు స్థానికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘మా సమస్యలను చెప్పుకోవడానికి ఎమ్మెల్యే, ఇతర అధికారులను కలవాలంటే మాకు ఎంతో కష్టంతో కూడిన పని.. అటువంటిది ఆంధ్రజ్యోతి మాకు అండగా నిలిచి సమస్యలు పరిష్కారానికి దారి చూపిందంటూ హాజరైన జనం కృతజ్ఞతలు తెలిపారు.
‘ ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రిక ఇటువంటి బృహత్తర కార్యక్ర మాలను నిర్వహించడం అభినందనీయం. గ్రీన్‌సిటీలో ప్రజలు పేర్కొన్న సమస్యలలో ప్రధా నంగా రూ.కోటీ ఏడు లక్షలతో రహదారి ఏర్పా టు పనులు సత్వరమే ప్రారంభిస్తాం. గ్రీన్ సిటీలో చెత్త సేకరణకు చర్యలు తీసుకుంటాం. పార్క్‌లో కరెంటు సౌకర్యం ఏర్పాటు, ఖాళీగా ఉన్న స్థలాలను క్లీన్ చేయిస్తాం. వచ్చే ఏడాదికి ఏలూరు నియోజకవర్గంలో అందరికీ గోదారి జలాలు తాగునీటిగా అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రూ.130 కోట్లతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశాం. వచ్చే వర్షాకాలం లోపు డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లతో డీపీఆర్ రూపొందించాం. 30 శాతం నిధులు కాలనీ వాసులు సమకూరిస్తే 70 శాతం నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించి అంతర్గత రహ దారులు అభివృద్ధి చేస్తాం. వచ్చే మూడేళ్లలో ఇక్కడ కమ్యూనిటీ హాలు, పార్క్ అభివృద్ధి చేస్తాం. కాలనీలో కుక్కల సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీ ఏర్పాటుకు కృషి చేస్తాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రైతు బజారుతో పాటు మిగిలిన సౌకర్యాలు ఏర్పాటు అవుతాయి. గ్రీన్‌సిటీ వంతెన వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తాం. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి 65 వేల భారీ మెజార్టీతో గెలిపించి పెద్ద బాధ్యతను అప్పగించారు.. నిరంతరం వారి అభ్యున్నతికే పాటు పడుతున్నాను.
కాలనీ అభివృద్ధికి చర్యలు : కోఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు
‘నగర అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నా ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఈ కాలనీ వాసుల ఇబ్బందులు గుర్తించి త్వరితగతిన అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. డ్రెయినేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరిస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏలూరు నగరాన్ని అన్ని విధాలా ఎమ్మెల్యే బడేటి చంటి అభివృద్ధి చేస్తున్నారు. నగరంలో విలీన గ్రామాలన్నింటికీ తాగునీరు అందించే ఉద్దేశ్యంతో రూ.130 కోట్లతో ప్రాజెక్టు రూపొందించారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ పూర్తయి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో పనులు ప్రారంభం అవుతాయి. ఐదు రిజర్వాయర్ల ద్వారా తాగునీరు అందిస్తాం.