ఫీజు కట్టి చిన్నారిని తీసుకెళ్లండి..!
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:48 AM
పెండింగ్ ఫీజు బకాయిలు రూ.34 వేలు చెల్లిస్తేనే మీ పాపను ఇంటికి పంపి స్తామని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం చెప్పినట్లు చిన్నారి మేనమామ చేసిన ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
పాలకొల్లులో ఓ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు..
అధికారుల విచారణ
తాము ఆ మాట అనలేదన్న ప్రిన్సిపాల్
పాలకొల్లు టౌన్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పెండింగ్ ఫీజు బకాయిలు రూ.34 వేలు చెల్లిస్తేనే మీ పాపను ఇంటికి పంపి స్తామని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం చెప్పినట్లు చిన్నారి మేనమామ చేసిన ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివరాలివి.. పాలకొల్లు వెలమగూడెం కు చెందిన వెల్డింగ్ పనిచేసుకునే నాగేంద్ర, రమాదేవిల కుమారుడు స్థానిక సన్‌షైన్ స్కూల్‌లో ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ చదువుతున్నారు. బుధవారం మధ్యా హ్నం పాఠశాల పూర్తయిన తర్వాత వీరిని తీసుకుని వెళ్లేందుకు మేనమామ నాగరాజు వచ్చాడు. ఫీజుల బకా యిలు చెల్లించాలని, పూర్తిగా చెల్లిస్తేనే పాపను ఇంటికి పంపుతామని స్కూల్ సిబ్బంది చెప్పడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగాడు. విషయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో వారు, పిల్లల తల్లిదండ్రులు కలిసి ఎంఈవోలు గుమ్మళ్ల వీరాస్వామి, గంగాధరశర్మలకు ఫిర్యాదు చేశారు. దీనిపై వీరు పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసి ఉన్నతా ధికారుల సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామ ని ఎంఈవోలు తెలిపారు. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ వివరణ ఇస్తూ ఫీజు కడితేనే చిన్నారిని పంపుతా మని తమ సిబ్బంది అనలేదని తెలిపారు. ఎడ్యుకేషన్ ఇయర్ క్లోజ్ అయిన నేపథ్యం బకాయి రూ.34 వేలు చెల్లించాలని కోరినట్లు చెప్పారు. అయితే చిన్నారి మేనమామ మద్యం మత్తులో వుండి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని అన్నారు. చిన్నారిని వెంటనే పంపించిన వేశామని వివరించారు.