ప్రజల్లో సానుకూలతకు పెద్దపీట
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:38 AM
‘ప్రభుత్వ సంక్షేమ, పథకాలను దిగువస్థాయిలో ప్రజలకు పారదర్శకంగా అందిస్తూనే.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టిగా నిర్ణయాలను తీసుకుని ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత (పబ్లిక్ పర్ ఫెక్షన్)కు పెద్దపీట వేయాలి’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు.
ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వరా?
25 వరకు సాగు, తాగునీటికి కాల్వలకు నీరు
డీఆర్‌సీలో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల దిశా నిర్దేశం
ఏలూరు,ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ సంక్షేమ, పథకాలను దిగువస్థాయిలో ప్రజలకు పారదర్శకంగా అందిస్తూనే.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టిగా నిర్ణయాలను తీసుకుని ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత (పబ్లిక్ పర్ ఫెక్షన్)కు పెద్దపీట వేయాలి’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లో మంత్రి నాదెండ్ల, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి శనివారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్‌సీ)లో పాల్గొ న్నారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయిలను ప్రతి 15 రోజులకొకమారు పెంచేలా శాఖల వారీగా పురోగతి చూపించా ల్సిందేనంటూ ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వరా?.. అంటూ అధికారులకు హెచ్చరి కలు జారీ చేశారు. దెందులూరు నియోజక వర్గంలో చింతమనేని ప్రభాకర్ దృష్టిలో లేకుం డా జల్‌జీవన్ మిషన్ ప్రతిపాదనలు పంపడం పై అసహనం వ్యక్తం చేస్తూ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ త్రినాథ్‌బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్విని ఆదేశించారు. జిల్లాలో పర్యాటకంతో పాటు టెంపుల్ టూరిజం, ఏకో టూరిజాన్ని ప్రోత్సహించాలన్నారు. వివిధ శాఖల పురోగతి ప్రకారం రాష్ట్రంలో ఏలూరు జిల్లా టాప్–5కు చేరుకుంది. ఇక టాప్–3 సాధిం చే బాధ్యతను అన్నిశాఖలతో పాటు ప్రజాప్రతి నిధులు తీసుకోవాలన్నారు. మంత్రి కొలుసు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లా అభివృద్ధికి ప్రభు త్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని ఇందులో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వెచ్చిస్తామన్నా రు. రోడ్ల మరమ్మతులు, పంచాయతీ రాజ్, పౌర సరఫరాలు, వ్యవసాయం, విద్యుత్, ధాన్యం కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు.
ముఖ్య తీర్మానాలు
మేలో ఏలూరు కార్పొరేషన్‌తో సహా మున్సి పాల్టీలు, అన్ని పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుదలకు కలెక్టర్ పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ
సాగు, తాగు, చేపల చెరువులకు నీటి సరఫరా కోసం ఈనెల 25వ తేదీ వరకు కాల్వలు నీటి విడుదలకు అనుమతి ఇవ్వా లని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానం. జూన్ నాటికి స్కూల్స్, సంక్షేమ, గిరి జన వసతి గృహాల్లో వసతుల మెరుగుకు ఆయా శాఖ ల నుంచి సమగ్ర ప్రతిపాదనలు వచ్చే డీఆర్‌సీకి నివేదించాలి.
గురుకులాల్లో 45 మంది వార్డెన్లను బదిలీ చేయాలని నిర్ణయం.
సమీక్షలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, డీసీఎంస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు, జేసీ అభిషేక్ గౌడ, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, సీపీవో శ్రీదేవి, ఎస్‌ఈలు విజయరత్నం, రమేష్‌బాబు, సాల్మన్‌రాజు, ఇన్‌చార్జి డీటీసీ కృష్ణారావు, డీఎస్‌వో విలియమ్స్, వ్యవసాయశాఖ జేడీ హబీబ్ బాషా, డీపీటీవో షేక్ షబ్నం, సెట్వెల్ సీఈవో కోట సూర్యప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
చింతలపూడికి బస్సులు నడపాలి
చింతలపూడి, పరిసర గ్రామాలకు రాత్రి 8 గంటలు దాటితే బస్సులు ఉండడం లేదు. మరిన్ని ఆర్టీసీ ట్రిపులు నడపాలి. రోడ్లను బాగు చేయించాలి. తెలంగాణకు వెళ్లే బస్సు సర్వీసులకు స్ర్తీశక్తి పథకం వర్తింపు చేయాలి.
– సొంగా రోషన్‌కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే
సీనియర్ వార్డెన్‌లను నియమించాలి
గిరిజన మండలాల్లోని వసతి గృహాల్లో ఇటీవల డీఎస్సీలో ఎంపికైన వార్డెన్లు విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. వారి స్థానం లో సీనియర్స్ నియమించాలి. బర్రింకలపాడు, బూసరాజుపల్లి గిరిజన వసతిగృహాల్లో సౌకర్యా లు కల్పించాలి.
– చిర్రి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే
బస్టాప్‌లను పునః నిర్మించాలి
వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ
జీలుగుమిల్లి రహదారి విస్తరణలో భాగంగా అక్కడ బస్టాప్‌లను తొలగించారు. తిరిగి నిర్మించాలి. జిల్లాలో పూర్తయిన రైతు భరోసా కేంద్రాలు తెరవాలి. పూర్తి కానివాటిని వెంటనే పూర్తి చేయాలి. ఏజెన్సీ, పోలవరం ముంపు ప్రాంతాల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలి.
లంక గ్రామాలకు బస్సు సర్వీసులను పెంచాలి
రాష్ట్ర వడ్డి కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి
ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకతో పాటు ఇతర గ్రామాలకు ఒక బస్సు అరకొర సర్వీసులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసులను పెంచాలి. చెరు వుల్లో దిగబడిన పాత విద్యుత్ స్థంభాలను ఐదేళ్ల నుంచి తొలగించాలని కోరుతున్న పట్టించుకోవడం లేదు. వీటి వల్ల చేపల వేటకు మత్య్సకారులకు ఇబ్బందిగా ఉంది.
గుర్రపుడెక్క తొలగించాలి
ఉంగుటూరు పరిసరాల్లో గోదావరి కాల్వలో గుర్రపు డెక్క తొలగించకపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతోంది. వెంటనే గుర్రపు డెక్క తొలగించాలి. ఇళ్లు నిర్మించుకోని వారికి రద్దు చేసి అర్హత కలిగిన వారికి మంజూ రు చేయండి.
– చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే
రోడ్లు పూర్తి చేయండి
బువ్వనపల్లి– నిడమర్రు, ఉండి – చేబ్రోలు రహదారుల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి. భీమడోలు బస్టాండ్‌ను ఆధునీకరిం చాలి. ద్వారకాతిరుమలకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను పెంచాలి.
– పత్సమట్ల ధర్మరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే
అదనపు సర్వీసులు పెంచాలి
ద్వారకాతిరుమలకు రోజుకు25 వేల మంది యాత్రికులు వస్తుంటారు. శని,ఆది వారాల్లో అదనపు సర్వీసులు నడపాలి. నల్లజర్ల రోడ్డు అధ్వానంగా ఉంది. భీమడోలు బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాను.
– మద్దిపాటి వెంకట్రాజు, గోపాలపురం ఎమ్మెల్యే