ప్రాథమిక విద్య బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:42 AM
ప్రాథమిక విద్యాబోధనలో ఫౌండేషనల్, లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్ ఎన్) విధానాన్ని అమలు చేయడం ద్వారా బాలబాలికల్లో అభ్యసన స్థాయిలు, ఫలితాల మెరుగుదలకు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు సమన్వయంతో కృషిచేయాలని సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్‌కుమార్ సూచించారు.
ప్రాథమిక విద్య బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలి : ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ
ఏలూరు అర్బన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక విద్యాబోధనలో ఫౌండేషనల్, లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్ ఎన్) విధానాన్ని అమలు చేయడం ద్వారా బాలబాలికల్లో అభ్యసన స్థాయిలు, ఫలితాల మెరుగుదలకు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు సమన్వయంతో కృషిచేయాలని సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్‌కుమార్ సూచించారు. స్థానిక సుబ్బమ్మదేవి మున్సిపల్ స్కూలు రీసోర్స్ సెంటర్‌లో శుక్రవారం ఏలూరు జిల్లాలోని 27 మండలాలనుంచి ముగ్గురేసి చొప్పున డీఆర్పీలు, కేఆర్పీలు, ఐసీడీఎస్ సీడీపీవోలు, ఉపాధ్యాయు లకు జ్ఞానజ్యోతి–2026 పేరిట రెండురోజుల రిఫ్రెషర్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని అమలుచేసి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపరచాలని కోరారు. జిల్లాస్థాయిలో శిక్షణ పూర్తిచేసుకున్నవారు మండలాల్లో టీచర్లకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణనిచ్చే విధానంపై సూచనలు చేశారు. సమగ్రశిక్ష సీఎంవో యెహోషువ, ఏఎల్‌ఎస్ కో–ఆర్డినేటర్ నాగేశ్వరరావు, విలీనవిద్య కో–ఆర్డినేటర్ భాస్కరరాజు, స్కూలు హెచ్‌ఎం కుటుంబరావు, సీఎంఆర్‌టీలు పాల్గొన్నారు.