Share News

పొగమంచుతో రొయ్యలు మృత్యువాత

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:27 AM

పొగమంచు నాలుగు రోజులుగా దట్టంగా కురుస్తుండ డంతో చెరువుల్లో నీటిపై మంచు పేరుకుపోయి ఆక్సిజన్‌ లోపించి వనామి రొయ్య లు మృత్యువాత పడుతున్నాయి.

పొగమంచుతో రొయ్యలు మృత్యువాత

కలిదిండి, జన వరి 18 (ఆంధ్ర జ్యోతి): పొగమంచు నాలుగు రోజులుగా దట్టంగా కురుస్తుండ డంతో చెరువుల్లో నీటిపై మంచు పేరుకుపోయి ఆక్సిజన్‌ లోపించి వనామి రొయ్య లు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో సుమారు లక్షా 10 వేలు ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. వాతావరణ మార్పులతో పొగమంచు ఉదయం 10 గంటల వరకు పడుతుండడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో ఆక్సిజన్‌ అందక చిన్నసైజు రొయ్యలతో పాటు కౌంటుకు వచ్చిన రొయ్య లు మృత్యువాత పడుతున్నాయి. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లు తోందని ఆక్వా రైతులు వాపోతున్నారు. చనిపోయిన రొయ్య లు రంగు మారడంతో వ్యాపారులు వీటిని కొనుగోలు చేయడం లేదు. ఏలూరు, ఆకివీడు మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకుంటు న్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టపోతు న్నారు. రొయ్యలకు ఆక్సిజన్‌ అందించేందుకు నిరంత రాయంగా ఏరియేటర్లను తిప్పుతున్నారు. ఖరీదైన మందు లను చల్లుతున్నారు. ‘చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత నివారణ కు తెల్లవారుజామున ఏరియేటర్లు తిరుగుతుం డాలి. చెరువుల్లో బోటులను తిప్పుతూ ఆయిల్‌ ఇంజన్లతో నీటిని రీసైక్లింగ్‌ చేయాలి. దీనివల్ల చెరువుల్లో కెరటాలు రావడం తో ఆక్సిజన్‌ ఉత్పన్నమవుతుంది. మంచు కారణంగా రొయ్యలకు వ్యాధులు, వైరస్‌ సోకుతాయి. వ్యాధులు సోకిన రొయ్యలను ల్యాబ్‌ పరీక్షలు జరిపి మందులు వాడాలి. ఆక్సిజన్‌ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచు కోవాలి’ అని జిల్లా ఇన్‌చార్జ్‌ అధికారి పి.రాజ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jan 19 , 2026 | 12:27 AM