Share News

ఏఎస్పీ సూర్యచంద్రరావుకు ఎస్పీగా పదోన్నతి

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:11 AM

ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌.సూర్యచంద్రరావుకు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (నాన్‌ క్యాడర్‌)గా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏఎస్పీ సూర్యచంద్రరావుకు ఎస్పీగా పదోన్నతి

ఏలూరు క్రైం, మార్చి 27 (ఆంధ్ర జ్యోతి): ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌.సూర్యచంద్రరావుకు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (నాన్‌ క్యాడర్‌)గా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయ న 1989 జనవరి 21న ఏలూరు రేంజ్‌ పోలీస్‌శాఖలో సివిల్‌ ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరారు. పెనుములూరు, గన్నవరం, కృష్ణలంక, ఎజెస్‌ విజయవాడ, సత్యనారాయణపురం, విజయవాడ టూటౌన్‌, సూర్యారావుపేట, పాలకోడేరు, పెదవేగి పోలీస్‌ స్టేషన్ల లో ఎస్‌గా పనిచేశారు. గుడివాడ రూరల్‌, తుని, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ(రెండుసార్లు), ఏలూరు టౌన్‌ (రెండుసార్లు), ఏలూరు సీసీఎస్‌ సర్కిళ్ళల్లో సీఐగా పనిచేశారు. డీఎస్పీగా పదోన్నతి పొం దిన అనంతరం విజయవాడ సిటీ సీఎస్‌ఈ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, తిరుపతి రైల్వే డీఎస్‌ఆర్పీ, నెల్లూరు డీటీసీ డీఎస్పీ, విశాఖ రేంజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎక్సైజ్‌), విజయవాడ సిటీ సౌత్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేశారు. అద నపు ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం విజయనగరం ఓఎస్డీ, ప్రకాశం, ఏలూరు, అడిషనల్‌ ఎస్పీ (ఎస్‌ఈబీ)గా పనిచేసి ప్రస్తుతం ఏలూరు జిల్లా ఏఎస్పీ (అడ్మిన్‌)గా విధులు నిర్వహి స్తున్నారు. ఆయనకు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (నాన్‌ క్యాడర్‌)గా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురు అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 12:11 AM