కట్ కటా!
ABN , Publish Date - May 23 , 2026 | 12:37 AM
భానుడి ప్రతాపానికి విద్యుత్ అంతరా యాలు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కి రవుతున్నారు. ప్రజలు బయటకు రావా లంటే ఎండలు.. ఇళ్లల్లో విద్యుత్ అంతరా యంతో ఏసీలు, ఫ్యాన్‌లు మూగబోవడంతో ఉక్కపోతతో వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
విద్యుత్ కోతలతో అవస్థలు
బయట ఎండ.. ఇంట్లో ఉక్కపోతతో మగ్గిపోతున్న జనం
జంగారెడ్డిగూడెం రూరల్/ఏలూరు రూర ల్/వేలేరుపాడు, మే 22(ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపానికి విద్యుత్ అంతరా యాలు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కి రవుతున్నారు. ప్రజలు బయటకు రావా లంటే ఎండలు.. ఇళ్లల్లో విద్యుత్ అంతరా యంతో ఏసీలు, ఫ్యాన్‌లు మూగబోవడంతో ఉక్కపోతతో వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు రోజులుగా అప్రటిత విద్యుత్ కోతలు తీవ్రస్థాయికి చేరుకున్నా యి. ఎండలు మండితే రిలీఫ్ లోడ్ పేరిట లేకపోతే మరమ్మతులు అంటూ కోతలు పెడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుం డా కరెంటు సరఫరా నిలిచిపోతుండడంతో గాలి రాక, ఉక్క పోతతో రాత్రి తెల్లవార్లూ జాగారం చేయాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్లకు ఇష్టానుసారంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతో వేసవి వచ్చిదంటే వాటిపై లోడ్ పెరిగి పేలిపోతున్నాయి. లేకుంటే తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
ఏలూరు రూరల్ మండలంలో రోజూ చెట్లు నరకడం, లైన్లు మార్చడం పేరుతో గంటల కొద్దీ కోత విధిస్తున్నారు. వేలేరుపాడులో కొన్నినెలలుగా లో ఓల్టేజ్ సమస్య తీవ్రంగా ఉంది. గతంలో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఉండగా అధికలోడు సమస్యతో అది కాలిపోవడంతో దానిస్థానంలో 60 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ అమర్చారు. అప్పటి నుంచి విద్యుత్ సమస్య ఏర్పడింది. దీనికి అదనంగా మరో 15 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చినప్పటికి వాడకానికి తగ్గ విద్యుత్‌ను అందించలేకపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, వేసేందుకు ప్రయత్నిస్తే లోఓల్టేజ్ సమస్య కారణంగా కాలిపోతున్నాయి. విద్యుత్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న చేనేత, తదితర ఇతర రంగాలు వారి జీవన మనుగడ సమస్యల్లోకి చేరింది. విద్యుత్ కోతల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నట్టు చిరు వ్యాపారులు వాపోతున్నారు. కరెంటు కష్టాలు రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఇన్వర్టర్లు, చార్జింగ్ ఫ్యాన్‌లు, లైట్‌లు, జనరేటర్లకు డిమాండ్ పెరుగుతోంది.
దేవులపల్లిలో రోడ్డెక్కి నిరసన
జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామస్థులు మూడు రోజులుగా విద్యుత్‌కు అంతరాయం కలుగుతోందని శుక్రవారం రాత్రి జంగారెడ్డిగూడెం–ఏలూరు ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. మహిళలు సైతం పెద్దఎత్తున తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. తామంతా ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి విద్యుత్ ఉండడం లేదని, దీంతో పిల్లలకు, వృద్ధులకు విసురుతూ నిద్ర లేకుండా గడపాల్సి వస్తోందని వాపోయారు. తాగునీటి సమస్య ఏర్పడిందని వాపోయారు. భారీగా ట్రాఫిక్ నిలవడంతో లక్కవరం ఎస్‌ఐ జబీర్ అక్కడకు వచ్చి వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.