అంగన్‌వాడీ కేంద్రాల్లో.. ఆరోగ్య భాగ్యం!
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:10 AM
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వేసవిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య భాగ్యం కల్పించేం దుకు పోషణ పక్వాడా పక్షోత్సవాలను నిర్వహిస్తు న్నారు. ఈనెల 9న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 23 వరకు కొనసాగుతాయి.
23 వరకు పోషణ్ పక్వాడా పక్షోత్సవాలు
గ ర్భిణులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
ప్రధానంగా పౌష్టికాహారంపై దృష్టి
ఆట పాటలతో అవగాహన కార్యక్రమాలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వేసవిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య భాగ్యం కల్పించేం దుకు పోషణ పక్వాడా పక్షోత్సవాలను నిర్వహిస్తు న్నారు. ఈనెల 9న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 23 వరకు కొనసాగుతాయి. చిన్నారుల పౌష్టి కాహారంపై ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఇంటింటికీ వివరించనున్నారు.ప్రభుత్వం స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలోని పది సీడీపీవో కార్యాలయాల పరిధిలో 2,226 అంగన్‌వాడీ కేంద్రా ల్లో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు పలు సూచనలు అంగన్‌వాడీ కేంద్రంగా అందివ్వనున్నారు. గర్భిణి అని తెలిసిన తర్వాత మహిళలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, విశ్రాంతి నియమాలు, ఇతర అంశాలను విశదీ కరించనున్నారు. బాలింతలకు ఆరోగ్య జాగ్రత్తలను వివరి స్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పదార్థాలు, వివిధ ఆట వస్తువులతో పిల్లలకు అవగాహన కల్పిస్తారు. చిన్నా రులు శారీరక, మానసిక ఇబ్బందులు లేకుండా ఎదిగేందుకు వారికి అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచిస్తున్నా రు. ఏడాది వయస్సు దాటిన నుంచి చిన్నారులకు ఎటువంటి పౌష్టికాహారం అందించాలి, టీకాలు, ఇతర ఆరోగ్య సంరక్షణ చర్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ప్యాకెట్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదని అవగాహన కల్పిస్తారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని, జంక్ ఫుడ్‌తో అధిక బరువు, మధుమేహ,ం రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశంపైన వివరిస్తారు. ప్రధానంగా జంక్‌ఫుడ్‌గా బదులుగా మిల్లెట్ (తృణధాన్యాలు)తో పలు లడ్డూల తయారీని నేర్పుతారు. పిల్లలకు వ్యాయామం ఉండేలా ఆటలను ప్రోత్సహించేలా చర్యలు చే పడతారు.
పురుషుల భాగస్వామ్యం.. అక్షరాస్యత పైన..
పిల్లల ఆరోగ్యంలో పురుషుల పాత్రపై వివరిస్తారు. పిల్లలు కలిసి ఇంట్లో వాడే పదార్థాలతో బొమ్మలు తయారు చేసేలా అవగాహన కల్పిస్తారు. చిన్నారులతో కలిసి తల్లిదండ్రుల్లో అక్షరాస్యత పెంచేలా కమ్యూనిటీ రీడింగ్ సర్కిల్‌ను విస్తరించనున్నారు. ప్రధానంగా తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు కనీసం అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ వారోత్సవాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. వయోజన విద్యాకేంద్రంలో చదువురాని వారిని చేర్పించి అక్షరాస్యులుగా చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.