పండుగ జోష్..
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:01 AM
సంక్రాంతి సందర్భంగా ఎక్కడికక్కడ మార్కెట్లు కళకళలాడుతున్నాయి.పగలు, రాత్రి తేడా లేకుండా జనంతో కిటకిటలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి సందడి రెట్టింపైంది.
మార్కెట్లకు సంక్రాంతి కళ
అన్ని వర్గాలలోనూ కొనుగోలు శక్తి
వస్త్ర దుకాణాలు, షాపింగ్‌మాల్స్ కిటకిట
ఎలకా్ట్రనిక్ వస్తువులు , బైక్‌లపై ఆఫర్లు
జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన అమ్మకాలు
సంక్రాంతి సందర్భంగా ఎక్కడికక్కడ మార్కెట్లు కళకళలాడుతున్నాయి.పగలు, రాత్రి తేడా లేకుండా జనంతో కిటకిటలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి సందడి రెట్టింపైంది. రైతులకు పంట సొమ్ము సకాలంలో చేతికి రావడం, ఇసుక రవాణా మెరుగుపడి భవన నిర్మాణ కార్మికులకు పూర్తిస్థాయిలో పనులు ఉండడం కారణంగా అన్ని వర్గాల్లోనూ కొనుగోలు శక్తి పెరగడంతో మార్కెట్‌లో జోష్ నెలకొంది. జిల్లాలోని ప్రధాన పట్టణ కూడళ్లు వాహనాల రద్దీతో ట్రాఫ్‌క్ జామ్‌తో కిటకిటలాడుతుండగా వ్యాపార కూడళ్లు కొనుగోలు దారులతో నిండిపోయాయి.
ఏలూరుసిటీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి వచ్చిందంటేనే మార్కెట్లు కళకళలాడుతుంటాయి. పండు గకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండడంతో మార్కె ట్‌లో సందడి నెలకొంది. సాధారణంగా దసరా పండుగతో పాటు సంక్రాంతి పండుగ రోజున కొత్త వాహనాలు కొను గోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పెద్ద పండుగ కావడంతో కొత్త వస్తువులతోపాటు వస్త్రాలు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు. దసరా మొదలుకుని సంక్రాంతి వరకు ప్రత్యేక ఆఫర్లు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా మోటార్ సైకిళ్ల షోరూంలు, కార్ల షోరూంలు బిజీబిజీగా కనిపిస్తున్నాయి. ఎలక్ర్టానిక్ ఉపకరణాల షోరూంలలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో ఫ్రిజ్‌లు, టీవీ లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, మైక్రోఓవెన్స్, వెట్ గ్రైండర్లు, మిక్సీలు వంటి వాటి కొనుగోలుపై వినియోగదారులు దృష్టి సారించారు. ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తుండడంతోపాటు ప్రతి రోజు ఒక గిప్ట్ కూపన్ ఇచ్చి డ్రా తీసి ప్రత్యేక బహు మతులను అందిస్తున్నారు. మోటార్ సైకిల్స్ షోరూమ్స్‌లో మెగా లోన్ అండ్ ఎక్చేంజ్ మేళాలను నిర్వహిస్తున్నారు. క్యాష్ బ్యాక్ డిస్కౌంట్‌తోపాటు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిం చారు. ఇవి వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తుం డడంతో కొత్త వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తు న్నారు. ఏలూరులో సాయిస్వర్ణ హీరో మోటార్స్ షోరూం లో ప్రతి హీరో వాహనం కొనుగోలుపై రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లేదా ఎక్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. అతి తక్కువ డౌన్ పేమెంట్‌తో వాహ నాలు కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. మిగిలిన మోటార్స్ షోరూంల్లోను ఆఫర్లు ఇస్తున్నారు. వస్త్ర దుకాణాలు వారు ఒకటి కొటే ఒకటి ఉచితం ఆఫర్‌తో పాటు సాధారణంగా ఉండే ధరకంటే బాగా తగ్గించి విని యోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇవిగాక వెయ్యి రూపా యలు పైన కొనుగోలు చేసే వారికి గిఫ్ట్ కూపన్లు ఇచ్చి ప్రతి రోజు డ్రా నిర్వహిస్తున్నారు. ఏలూరు నగరంతో పాటు భీమవరం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేల్లిగూడెం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు తదితర ప్రాంతాలలో వస్త్రదుకాణాలు, షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి.
ఆన్‌లైన్ కొనుగోళ్లు..
ఇక ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు ఏడాదికేడాదికి పెరుగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ సంస్థల ద్వారా అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తు న్నారు. సంక్రాంతి సమయంలో ఆన్‌లైన్ వ్యాపారంలో వస్త్రవ్యాపారం జోరుగా సాగుతోంది. ఇవేకాకుండా ఎలకా్ట్రనిక్ పరికరాలు, గృహోపకరణాలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
ఎటు చూసినా.. పండుగ సందడి
అత్తింటికి కొత్త అల్లుళ్ల రాక
బంధువులతో కోలాహలంగా లోగిళ్లు
ఏలూరుసిటీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. గతంలో పోలిస్తే ఈ ఏడాది పట్టణాలు, పల్లెలు కళకళలాడుతున్నాయి. బంధువులు, అతిథులు, దేశ విదేశాల్లో స్థిరపడిన వారు తమ తమ స్వస్థలాలకు తరలివస్తున్నారు. బస్సులలో ఇతర ప్రాంతా ల నుంచి వచ్చే బంధువులతో కిటకిటలాడుతున్నాయి. తమ స్వస్థలాలకు రావడానికి ముదుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాలతో పాటు విదేశాలకు చెందిన వారు తమ సొం తూళ్లకు రావడానికి ముందే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. మరోవైపు వాడవాడలా సంక్రాంతి సంబరాలు జరుగుతు న్నాయి. ముగ్గుల పోటీలు, క్రికెట్ పోటీలు, కబడ్డీపోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి కొత్త అలుళ్లు ఇంటికి రావడం ఆనవాయితీ. ఇప్పటికే అల్లుళ్ల రాక మొదలైంది. వారికి మర్యాద చేయడం కోసం సంక్రాంతి వంటకాలు సిద్ధమయ్యాయి. భోగి పండుగ కోసం మంటలు వేయడా నికి యువత ఇప్పటి నుంచే చెట్ల దుంగలను సేకరిస్తు న్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట ముగ్గుల్లో పెట్టిన పిడకలను భోగి రోజున భోగి మంట లలో వేస్తారు.
నేడు జడ్పీలో సంక్రాంతి సంబరాలు
ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జడ్పీ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సంబరాలకు సంబంధించి ఇప్పటికే జడ్పీ ఉద్యోగులకు, మండల పరిషత్‌ల ఉద్యోగులకు క్రికెట్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ పోటీలు నిర్వి హంచారు. సోమవారం జడ్పీ కార్యాలయ ఆవరణలో ఉదయం 8గంటలకు ముగ్గుల పోటీలను నిర్వహించ నున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు సీఈవో ఎం.శ్రీహరి తెలిపారు.