Share News

పాలిటెక్నిక్‌లో 72 శాతం సీట్లు భర్తీ

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:33 AM

పాలిటెక్నిక్‌ కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

పాలిటెక్నిక్‌లో 72 శాతం సీట్లు భర్తీ

2,957 సీట్లకు మొదటి కౌన్సెలింగ్‌లో 2,127 మంది విద్యార్థుల చేరిక..

రెండో కౌన్సెలింగ్‌ ప్రారంభం

భీమవరం రూరల్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. జిల్లాలోని ఎనిమిది పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2,957 సీట్లు ఉన్నాయి. గత నెల చివరి వారంలో జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో 2,127 సీట్లు అంటే 72 శాతం భర్తీ అయ్యాయి. మిగిలిన 830 సీట్లకు ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు రెండో విడత కౌన్సెలింగ్‌ జరుగు తుంది. 22న సీట్లు కేటాయిస్తారు. వీటిలో చాలా వరకు భర్తీ అవుతాయని యాజమాన్యాలు భావిస్తు న్నాయి. కూటమి ప్రభుత్వం రాకతో నిర్ణీత సమయం లో పాలిసెట్‌, కౌన్సెలింగ్‌ జరిగి జూలైలో తరగతులు మొదలవుతున్నాయి. వీటిల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని తొమ్మిది కళాశాలలకు 3,080 సీట్లు వుంటే 2,161 సీట్లు అంటే 70 శాతం భర్తీ అయ్యింది. ఈ ఏడాది మొదటి కౌన్సెలింగ్‌ పూర్తయ్యే సరికి 72 శాతం నిండుకున్నాయి. ఈ లెక్క ప్రకారం గత ఏడా దికంటే సీట్ల భర్తీ పెరిగింది. ఎక్కువ మంది విద్యా ర్థులు కంప్యూటర్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్‌ కోర్సులపై మక్కువ చూపుతున్నారు. ఈ కోర్సులకు సంబంధిం చి రెండు వేలకు పైగా సీట్లు వుంటే.. మొదటి కౌన్సె లింగ్‌లో 80 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇవి పెరిగే అవకాశాలున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి తరగతులు మొదలయ్యా యి. ఈ లెక్కన పాలిటెక్నిక్‌ కళాశాలలకు పూర్వ వైభవం దాదాపు వచ్చినట్టే భావిస్తున్నారు.

అందుబాటులో సీట్లు

‘తాడేపల్లిగూడెం గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశా లలో మెకానికల్‌, సివిల్‌లో సీట్లు ఖాళీ వున్నాయి. రెండో కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఈ సీట్లకు ఆప్షన్‌పెట్టుకోవచ్చు. పాలిసెట్‌ రాయకపోయినా టెన్త్‌ ఉత్తీర్ణులైన వారు స్పాట్‌ అడ్మిషన్‌లో చేరవచ్చు’ అని ప్రిన్సిపాల్‌ పి.ఫణీంద్రప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Jul 17 , 2026 | 12:33 AM