9 వరకు పాలిసెట్ దరఖాస్తుకు గడువు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:14 AM
పదవ తరగతి పాసైన వారుకానీ, పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూసే విద్యార్థులు గానీ పాలిసెట్ రాయడానికి అర్హులు.
9 వరకు పాలిసెట్ దరఖాస్తుకు గడువు
పలు కళాశాలల్లో ఉచిత శిక్షణ
జంగారెడ్డిగూడెం/పోడూరు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): పదవ తరగతి పాసైన వారుకానీ, పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూసే విద్యార్థులు గానీ పాలిసెట్ రాయడానికి అర్హులు. ఈనెల 9వ తేదీన పాలిసెట్ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ. టెక్నికల్ కోర్సులపై ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 25న పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులకు 24వ తేదీ వరకు ఉచిత కోచింగ్‌తో పాటు మెటీరియల్ కూడా ఉచితంగా అందచేస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం వరకు తమ కళాశాలలో పాలిసెట్ కోసం దరఖాస్తు చేయడానికి సిబ్బందిని ఏర్పాటు చేశామని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ అవకాశం విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 94407 60060, 94914 81825 ఫోన్ చేసి సంప్రదించవచ్చునని తెలిపారు.
పోడూరులోని కల్నల్ డి.ఎస్.రాజు పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 6వ తేదీ నుంచి ఉదయం గం.9–00 నుంచి మధ్యాహ్నం గం.12–00 వరకు ఉచిత పాలిసెట్ కోచింగ్ (పాలిసెట్– 2026) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డి.పి.ప్రకాష్ తెలిపారు. ఈ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.
ఉండ్రాజవరంలోని బౌద్ద పీఠం ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బౌద్ధ ధమ్మపీఠం– మైత్రేయ బుద్ధ విహార్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. ఇతర వివరాలకు టి.కృష్ణ 98668 48509, 85007 68009 లతో సంప్రదించాలని తెలిపారు.