Share News

ప్రభంజనం

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:12 AM

జిల్లాలో పోలింగ్‌ జరిగిన ఎనిమిది మండ లాల్లో చాలాచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6.30 గంటలకే ఓటు వేయడానికి ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చారు.

ప్రభంజనం
భీమడోలులో ఓటు వేస్తున్న మహిళ

రెండో విడత పల్లెపోరు ప్రశాంతం

రికార్డు స్థాయిలో 82.34 శాతం ఓటింగ్‌

జిల్లాలో 160 సర్పంచ్‌, 1,219 వార్డులకు పోలింగ్‌

మండవల్లిలో అత్యధికం 85.51 శాతం నమోదు

రెండో విడత పల్లె పోరులో ఓటర్లు ప్రభంజనంలా ఓటె త్తారు. భీమడోలు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడ మర్రు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలాల్లో 166 గ్రామాల్లోని 160 సర్పంచ్‌, 1,219 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగ కుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

(ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పోలింగ్‌ జరిగిన ఎనిమిది మండ లాల్లో చాలాచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6.30 గంటలకే ఓటు వేయడానికి ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చారు. పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి బారులు తీరి కనిపిం చారు. ఉదయం తొమ్మిది గంటలకు 9.72 శాతం, 11 గంటలకు 59.17 శాతం ఓటింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసే ఒంటి గంట సమయానికి పోలింగ్‌ కేంద్రాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఓటు వేయటానికి ఉన్నారు. మొత్తానికి జిల్లాలో 82.34 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలోనే అత్యధికంగా మండవల్లి మండలంలో 85.51 శాతం పోలింగ్‌ జరిగింది.

పటిష్ఠ బందోబస్తు

ఏలూరు క్రైం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలీస్‌ శాఖ పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసు కుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ముందస్తుజాగ్రత్తలు తీసుకో వడంతో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2026 | 01:12 AM