నువ్వా..నేనా?
ABN , Publish Date - Oct 28 , 2026 | 01:12 AM
జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మంగళ వారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు 224 మంది నామి నేషన్లు వేయగా పరిశీలన అనంతరం 193 నామినేషన్లు వాలిడేటెడ్ నామినేషన్లుగా పేర్కొన్నారు.
పెదవేగి జడ్పీటీసీగా చింతమనేని సాయి నవ్యశ్రీ ఏకగ్రీవం
101 మంది నామినేషన్ల ఉపసంహరణ
ముగిసిన గడువు.. విడుదలైన తుది జాబితా
జడ్పీ పీఠం రేసులో నవ్యశ్రీ, జాహ్నవి
ఎన్నికల ఫలితాల తర్వాత సీల్డ్‌కవర్‌లో పేరు
(ఏలూరు/ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మంగళ వారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు 224 మంది నామి నేషన్లు వేయగా పరిశీలన అనంతరం 193 నామినేషన్లు వాలిడేటెడ్ నామినేషన్లుగా పేర్కొన్నారు. 101 మంది అభ్యర్థులు నామినేషన్లును ఉపసంహరించుకోగా ఎన్నికల బరిలో 92 మంది మిగిలారు. పెదవేగి జడ్పీటీసీ స్థానానికి సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీతో పాటు మరో ముగ్గురు నామినేషన్ వేశారు. చివరి రోజు ఆ స్థానంలో వైసీపీ అభ్యర్థితో పాటు మరో ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పెదవేగి జడ్పీటీసీ స్థానానికి సాయినవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. దీంతో 26 జడ్పీటీసీ స్థానాలకు 92 మంది తలపడనున్నారు. 454 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరు మండలాల నుంచి 11 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యా రు. దీంతో 443 ఎంపీటీసీ స్థానాల బరిలో 1,027 మంది నవం బరు 3న జరిగే ఎన్నికల్లో అమీతుమీకి సిద్ధం అయ్యారు.
జడ్పీ పీఠం ఎవరిదో ?
జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఎవరి కేటాయించాలన్న విష యంలో కూటమి నుంచి ఇంకా స్పష్టత రాలేదు. చాలాకాలం తర్వాత ఓసీ మహిళకు ఈ పదవి రిజర్వు అయింది. ఎన్నికలు సజావుగా పూర్తయిన తర్వాత జడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునే సమయంలో సీల్డ్‌కవర్‌లో పేరును అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా చింతమనేని కుమార్తె నవ్యశ్రీ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ కుమార్తె మందలపు జాహ్నవి చైర్‌పర్సన్ పదవి రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ముసునూరు నుంచి గద్దె మౌనశ్రీ పేరు పరిగణనలోకి తీసుకునే అవ కాశం లేకపోలేదు. వైసీపీ కూడా జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఎవరివ్వాలనే దానిపై ఇంకా నిర్ణయం ప్రకటించలేదు.
మాగంటి సతీమణి నామినేషన్ వెనక్కి..
జడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబానికి తీవ్ర నిరాశ ఎదురైంది. మాగంటి సతీమణి పద్మ వల్లీ దేవిని బరిలో నిలిపేందుకు కామ వర పుకోట నుంచి నామినేషన్ వేయించారు. ఆది వారం రాత్రి వరకు మ్యాండెట్ ఖరారవు తుం దని ఆశించారు. పార్టీ జిల్లా పరిశీలకురాలు పంచుమర్తి అనురాధ మాగంటి కుటుంబానికి ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని సూచించ డంతో మంగళవారం నామినేషన్‌ను ఉప సంహరించు కున్నారు. ఇతర నామినేటెడ్ పదవితో ఆ కుటుంబాన్ని సంతృప్తిపరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం.
జడ్పీటీసీ బరిలో 92 మంది
ఆగిరిపల్లి : తమ్మిశెట్టి పాపన జ్యోతి సుజన కుమారి(వైసీపీ), జానేసు (కాంగ్రెస్) వీరబత్తిన జోసి బాబు(టీడీపీ), యలమర్తి సుబ్బరాజు బాబు(స్వతంత్ర)
భీమడోలు: నిమ్మకాయల గణపతి(జనసేన), మద్దుల నాగరాజు(వైసీపీ)
చాట్రాయి: తేళ్ళూరి శేఖర్(టీడీపీ), దుర్గం పుల్లారావు (సీపీఐ(ఎంఎల్), పిస్సంపల్లి రాము(వైసీపీ), సాధు బాబారావు(కాంగ్రెస్)
జీలుగుమిల్లి: నాగమణి కుంజా (టీడీపీ), సూరమ్మ కొరస(వైసీపీ)
మండవల్లి: అంబేద్కర్ ఘంటా(బీఎస్పీ), కాట్రగడ్డ శంకర్‌రావు(టీడీపీ), చేబోయిన శ్రీనివాసులు(వైసీపీ), బుర్ర కృష్ణ (కాంగ్రెస్), ఘంటసాల వరలక్ష్మి (స్వతంత్ర), ఘంటసాల శ్రీనివాసరావు(స్వతంత్ర)
నూజివీడు: కొసరాల లక్ష్మి(టీడీపీ), మట్టా రామలక్ష్మి(వైసీపీ), రజని కొండేటి(కాంగ్రెస్)
టి.నరసాపురం: కూరపాటి సుజాత(టీడీపీ), గుర్రం బేబీ మనీషా(బీఎస్పీ), హరిషా గుండె (వైసీపీ)
వేలేరుపాడు: కారం రాధ(కాంగ్రెస్), కుమారి కుంజా(వైసీపీ), గొంది సీత(టీడీపీ)
పోలవరం: తాతి త్రిపుర్ణ సుందరి (కాంగ్రెస్), నాగుబండి సుంకర (వైసీపీ), మొగళ్ళ జనకి సత్య గోవర్ధన స్వామి(జనసేన)
నిడమర్రు : పాపోలు వెంకట సత్యవతి (వైసీపీ), మైలవరపు రామలక్ష్మి (జనసేన)
ముసునూరు: కొల్లి మాధవి (వైసీపీ), మౌని శ్రీ గద్దె(టీడీపీ), వీరమాచినేని పద్మావతి (కాంగ్రెస్)
లింగపాలెం: చేబత్తుల పరిశుద్ధం(కాంగ్రెస్), ముసునూరి వెంకట బేబీ సరోజినీ(టీడీపీ), మోరంపూడి ప్రమీలారాణి(వైసీపీ)
కుక్కునూరు: కొమలాదేవి బొంతు(టీడీపీ), చిలకా రాణి(వైసీపీ), మేడిపల్లి సురేఖ (స్వతంత్ర), వేల్పుల తిరుపతమ్మ(స్వతంత్ర)
బుట్టాయిగూడెం: తెల్లం నాగమణి సీపీఐ (మార్క్సిస్ట్), పినిమెల దుర్గమ్మ(కాంగ్రెస్), బాలకృష్ణ కొర్స(వైసీపీ), మెట్లా బుచ్చిబాబు (జనసేన), తెల్లం రమేష్(స్వతంత్ర)
కామవరపుకోట: జాహ్నవి మందలపు (టీడీపీ), దుర్గాదేవి ఆకుల(కాంగ్రెస్), రాధిక దేవరపల్లి (వైసీపీ)
కొయ్యలగూడెం: అబ్బులు కూనపోము (కాంగ్రెస్), వాదపల్లి రమేష్ (జనసేన), శ్రీ లక్ష్మి దాసరి (వైసీపీ)
కలిదిండి: కుసంపూడి దుర్గారాణి (వైసీపీ), నల్లగోపుల వెంకట చలపతిరావు (జనసేన), మారుబోయిన వరలక్ష్మి (కాంగ్రెస్), జమ్ము సురేష్‌కుమార్ (స్వతంత్ర)
జంగారెడ్డిగూడెం: గొల్లమందల సంకీర్తన (టీడీపీ) పొడమాటి నందిని(వైసీపీ), శాంతా కుమారి కనుమూరి(కాంగ్రెస్), హేమలలిత కొసనం(స్వతంత్ర)
దెందులూరు: పెనుబోయిన మహేష్‌బాబు (టీడీపీ), వేదకుమారి తొత్తడి (వైసీపీ)
కైకలూరు: కాసులు జయమంగళ (వైసీపీ), కొయ్యలగడ్డ పుల్లయ్య(కాంగ్రెస్), జయకు మార్ అందుగుల(బీఎస్పీ), బలే ఏసురాజు (టీడీపీ), గూట్ల ఈశ్వర్ (టీఎన్‌జీపీ)
ముదినేపల్లి: చలమయ్య బొర్రా(టీడీపీ), మదిరి శివకుమార్(బీఎస్పీ), రామిశెట్టి వీర వెంకట సత్యనారాయణ (వైసీపీ), వాసుపల్లి రమేష్(కాంగ్రెస్)
చింతలపూడి: జగన్నాధం అబ్బురం(టీడీపీ), దేశావతు సైదా(కాంగ్రెస్), భూక్య రవికుమా ర్(వైసీపీ), జరబల వెంకటేశ్వరరావు (స్వతంత్ర)
ఉంగుటూరు: చింతల శ్రీనివాస్(టీడీపీ), యెలిశెట్టి రామకృష్ణ పాపారావు బాబ్జీ (వైసీపీ), పుట్టా కుమార్(టీఎన్‌జీపీ), జల్తు సత్యగాంధీ(స్వతంత్ర)
పెదపాడు: చౌటపల్లి విక్రమ్‌కిషోర్(బీజేపీ), తలారి లక్ష్మి (కాంగ్రెస్), నవీన్ గుజ్జుల (వైసీపీ), కోటే సోమేశ్వరరావు (ఆర్‌పీఐ)
ద్వారకాతిరుమల: బుసనబోయిన విజయలక్ష్మి (వైసీపీ), విజయలక్ష్మి పెద్దిరెడ్డి(కాంగ్రెస్), సత్య శ్రావణి కరుటూరి(టీడీపీ), దేవిశ్రీ దాకారపు(స్వతంత్ర)
ఏలూరు : ఘంటసాల రుక్మాంగద మహారాజు(వైసీపీ), ఘంటసాల శ్రీనివాస్ (టీడీపీ), ఇప్పిలి రవి (స్వతంత్ర).