147
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:39 AM
జిల్లాలో పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. మొత్తం ఓటర్లు 16 లక్షల 44 వేల 193 మంది ఇప్పటి వరకు 1,744 కేంద్రాల్లో ఓటు వేసే వారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 147 పోలింగ్ కేంద్రాలకు అదనంగా పెరగడంతో, ఇక రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 1,891 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.
జిల్లాలో పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య
గతంలో 1,744.. ప్రస్తుతం 1,891
ఎన్నికల సంఘానికి యంత్రాంగం నివేదిక.. త్వరలో గెజిట్ నోటిఫికేషన్
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. మొత్తం ఓటర్లు 16 లక్షల 44 వేల 193 మంది ఇప్పటి వరకు 1,744 కేంద్రాల్లో ఓటు వేసే వారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 147 పోలింగ్ కేంద్రాలకు అదనంగా పెరగడంతో, ఇక రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 1,891 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ప్రజలు సులభంగా, సకాలంలో ఓటు హక్కు వినియోగించే దిశగా పోలింగ్ కేంద్రాల పునర్విభజనకు ఎన్నికల సంఘం చేపట్టిన కసరత్తు పూర్తయింది. నిరంతరం ఓటర్ల జాబితాలో మార్పుల, సవరణలను చేస్తూనే పోలింగ్ కేంద్రాల ఓటర్లకు అందు బాటులో ఉండేలా సంస్కరణలను చేపట్టింది. ఈ ఫలితంగా జిల్లాలో సుదీర్ఘకాలంలో చేపట్టిన పోలింగ్ కేంద్రాల పెంపు కొలిక్కి వచ్చింది. ఏడు నియోజకవర్గాల్లో 147 పోలింగ్ కేంద్రాల పెంపు జరిగింది. కనీసం వెయ్యి ఓట్లకు తగ్గకుండా పోలింగ్ బూత్‌ల్లో ఓట్లేసే విధంగా ఈ విభజన చేశారు. మరోవైపు కనీస వసతులకు దూరంగా ఉన్న కేంద్రాలను నిలుపుదల చేయడం, బడి, గుడుల్లో కొనసాగిన వాటిని తగ్గించి అందరికి అనువుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. జిల్లాలో గతంలో ఏడు నియోజకవర్గాల్లో 1,744 పోలింగ్ కేంద్రాలుండగా, తాజాగా 147 పోలింగ్ కేంద్రాల పెంపు చేపడుతూ అన్ని రాజకీయ పక్షాలు సూచనలు, సలహాలతో యంత్రాంగం ఎన్నికల సంఘానికి నివేదించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాలకు కలిపి ఓవరాల్‌గా పోలింగ్ కేంద్రాల పెంపును ఆమోదిస్తూ గెజిట్‌లో వెల్లడించనుంది. సర్ కార్యక్రమం గడువును ఇటీవల 24వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో 25వ తర్వాత పోలింగ్ కేంద్రాల పెంపును ఆమోదిస్తూ నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.