Share News

మహిళలకు అండగా పోలీస్‌

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:24 AM

ఏపీ పోలీసులు మహిళలకు అండగా వున్నారు. వారు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా స్నేహపూరిత వాతావరణం కల్పించాం’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

మహిళలకు అండగా పోలీస్‌
ఏలూరులో పిల్లలతో హోంమంత్రి అనిత

సమస్యల్ని నిర్భయంగా చెప్పుకోవచ్చు.. అభయ బాక్సుల్లో ఫిర్యాదు చేయవచ్చు.. హోం మంత్రి అనిత

ఏలూరు క్రైం/పెదపాడు/పెదవేగి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి):ఏపీ పోలీసులు మహిళలకు అండగా వున్నారు. వారు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా స్నేహపూరిత వాతావరణం కల్పించాం’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏలూరులో మహిళా పోలీస్‌ స్టేషన్‌, పెదవేగి, పెదపాడులలోని నూతన పోలీస్‌ స్టేషన్‌ భవనాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ‘అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్‌ స్టేషన్‌లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుంది. మహిళలకు ఏదైనా కష్టం వస్తే పుట్టింటికి వెళ్లి తమ సమస్యలను తల్లిదండ్రులకు ఎలా తెలియజేస్తారో అలాగే ఈ స్టేషన్‌కు వచ్చి వారి బాధలను తెలియజేసుకోవచ్చు. ప్రధాన కూడళ్లలో అభయ ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తాం. మహిళలు తమ ఫిర్యాదులను ఒక కాగితంపై రాసి ఆ బాక్సులో వేయవచ్చు. అభయ యాప్‌ను తమ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని వాయిస్‌ మెస్సేజ్‌లనూ పంపవచ్చు. ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టుకు ఏలూరు జిల్లాను ఎంపిక చేశాం. ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిశోర్‌ ప్రజల రక్షణలో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూండడం అభినందనీయం. శాంతి భద్రతల విషయంలో పోలీస్‌ శాఖ నిబద్దతతో పనిచేస్తోంది’ అని అన్నారు. నూతన భవనాన్ని పరిశీలించిన అనంతరం హోం మంత్రి అనిత్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కను నాటారు. ఏలూరు ట్రాఫిక్‌ క్రాస్‌రోడ్ల పార్కును సం దర్శించి పార్కులో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులను అభినందించారు.

పలు రోడ్లు ప్రారంభం

అంతకు ముందు హోంమంత్రికి అప్పన వీడు అభయాంజనేయ స్వామిని దర్శించు కుని పూజలు నిర్వహించారు. పెదపాడు, పెదవేగిలలోని పోలీసు స్టేషన్‌ భవనాలను ఎమ్మెల్యే చింతమనేనితో కలిసి ప్రారంభించారు. పెదపాడులో సీసీ రోడ్‌, పెదపాడు–వట్లూరు రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. పెదవేగి సొసైటీ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెదవేగి సీసీ రోడ్డును ప్రార ంభించారు. పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి, వసతులను పరిశీలించారు. శ్రీరాట్నాలమ్మ తీర్ధప్రసాదాలను ఆలయ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు ఆమెకు అందించారు. ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, ఏఎస్పీ సుస్మిత ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి జయశర్మ, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె.శివశ్రీనివాస్‌, జడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ, ఆర్టీసీ విజయవాడ–2 ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్‌, పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్‌ ఛైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ గారపాటి రామసీత తదితరులు పాల్గొన్నారు

Updated Date - Apr 10 , 2026 | 12:24 AM