క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్తేజం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:19 AM
‘పోలీస్ సిబ్బంది నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై విధులు నిర్వర్తిస్తూ, ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. ఈ పరిస్థితుల్లో క్రీడలు పోలీసు సిబ్బందిలో మానసిక ఉల్లాసం, శారీరక ధృఢత్వం, ఉత్తేజం, చురుకుదనం పెంపొందిస్తాయి’ అని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు.
స్పోర్ట్స్ మీట్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు
ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ కిశోర్ అభినందనలు
ఏలూరు క్రైం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘పోలీస్ సిబ్బంది నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై విధులు నిర్వర్తిస్తూ, ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. ఈ పరిస్థితుల్లో క్రీడలు పోలీసు సిబ్బందిలో మానసిక ఉల్లాసం, శారీరక ధృఢత్వం, ఉత్తేజం, చురుకుదనం పెంపొందిస్తాయి’ అని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ‘విట్ మంగళగిరి యూనివర్శిటీ’లో ‘ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026’ నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో ఏలూరు రేంజ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చి మొత్తం 308 పతకాలను సాధించిన క్రీడాకారులను ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌తో కలిసి అభినందించారు. ఈ నేపథ్యంలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఏలూరు అమీనాపేటలోని సురేష్‌చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలోని పోలీస్ కల్యాణ మండపంలో మంగళవారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వీరిద్దరితోపాటు జిల్లా అదనపు ఎస్పీ వై. ప్రసాదరావు హాజరై పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. 119 గోల్డ్‌మెడల్స్, 116 సిల్వర్ మెడల్స్, 73 బ్రాంజ్ మెడల్స్ మొత్తం 308 పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారన్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఒకే వేదికపై క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల వారిలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్నేహభావం, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయన్నారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో క్రీడాపోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని అధికారులు ఆకాం క్షించారు. కార్యక్రమంలో విజయవాడ సీడీపీ ఎస్‌డబ్ల్యూ బి.సత్యనా రాయణ, కాకినాడ ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ ఏఆర్ డీఎస్పీ శ్రీహరిరావు, మెడల్స్ పొందిన పోలీసు అధికారులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
స్పోర్ట్స్ మీట్‌లో తాడేపల్లిగూడెం కానిస్టేబుళ్లకు పతకాలు
తాడేపల్లిగూడెం రూరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అమరావతిలో జరిగిన ఏపీ స్పోర్ట్స్ పోలీస్ మీట్‌లో తాడేపల్లిగూడెం పట్టణ కానిస్టేబుల్ దార్లంక అనీల్ కుమార్ ప్రతిభ కనబరిచారు. స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఒక గోల్డ్ మెడల్, రెండు సిల్వర్ మెడల్స్, రెండు కాంస్య పతకాలు సాధించి పశ్చిమ గోదావరి జిల్లా సత్తా చాటాడు. ఈ సందర్భంగా మంగళవారం భీమవరంలో అతడిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినం దించారు. అదేవిధంగా స్టేట్ పోలీస్ మీట్‌లో తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ పుసుపులేటి సత్యనారా యణ స్విమ్మింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్, ఒక కాంస్య పతకం సాధించారు.