ప్రజలతో మర్యాదగా నడుద్దాం..
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:12 AM
ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ, నేరాల నియంత్రణలో కఠినంగా ఉండాలని వన్‌టౌన్ సీఐ కె. రామకృష్ణ అన్నారు.
ఏలూరు క్రైం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ, నేరాల నియంత్రణలో కఠినంగా ఉండాలని వన్‌టౌన్ సీఐ కె. రామకృష్ణ అన్నారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ, సుధాకర్, రూరల్ ఎస్‌ఐ వి.వెంకటేశ్వరరావు శుక్రవారం ఏలూరు వన్‌టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లసిబ్బందికి కవాతు నిర్వహించారు. పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణను పెంపొందించడం, విధుల్లో అప్రమత్తంగా ఉండేలా వారిని సిద్ధం చేయడానికి ఈ పరేడ్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో, అత్యవసర సమయాల్లో సిబ్బంది ఏ విధంగా స్పందించాలో, స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ఏ విధంగా నిఘా ఉంచాలో సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు.