Share News

ఏలూరులో కార్డెన్‌ సెర్చ్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:03 AM

కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను ఏలూరులో టూటౌన్‌ పోలీసులు, ఈగల్‌ సిబ్బంది నిర్వహించారు.

ఏలూరులో కార్డెన్‌ సెర్చ్‌
లంకపేటలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ఏలూరు క్రైం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ వజ్రపహార్‌లో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌ ఆదేశాలపై కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను ఏలూరు టూటౌన్‌ పోలీసులు, ఈగల్‌ సిబ్బంది నిర్వహించారు. ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లంకపేట, కుమ్మరిరేవు ప్రాంతాలను గంజా యి రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీలు ఆయా ప్రాంతాల్లోని అనుమానా స్పద ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టే దిశగా ప్రత్యేక తనిఖీలు చేపట్టామన్నారు. డాగ్‌ స్క్వాడ్‌, డ్రోన్‌ సహాయ ంతో అనుమానాస్పద ప్రాంతాలను కూడా పరిశీలించామన్నారు. ఆపరేషన్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపడతామన్నారు. అదే విధంగా అనుమానిత 11 మంది వ్యక్తు లకు గంజాయి డిటెక్షన్‌ కిట్స్‌ ద్వారా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయన్నారు. ఈ ప్రాంతంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కార్యకలాపాలు పూర్తిగా అరికట్టడం, యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచడం, ప్రజలకు సురక్షిత వాతా వరణం కల్పించడమే ఈ ఆపరేషన్‌ ప్రధాన ఉద్దేశమన్నారు. టూటౌన్‌ సీఐ కె.అశోక్‌ కుమా ర్‌, ఎస్‌ఐ బి.మధు వెంకట రాజా, ఎస్‌ఐ కె. రామకృష్ణ, ఈగల్‌ ఎస్‌ఐ ఉదయభాస్కర్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందం డ్రోన్‌ బృందం సుమారు 50 మంది పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:03 AM