Share News

పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో కార్డన్‌ సెర్చ్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:35 AM

నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఇటీవల కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్‌ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి జయశర్మ ఆధ్వర్యంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ను ఏలూరు రూరల్‌ మండలం పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో ఆదివారం వేకువజాము నుంచి నిర్వహించారు.

పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో కార్డన్‌ సెర్చ్‌
పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఏలూరు క్రైం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఇటీవల కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్‌ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి జయశర్మ ఆధ్వర్యంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ను ఏలూరు రూరల్‌ మండలం పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో ఆదివారం వేకువజాము నుంచి నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు జి . సత్యనారాయణ, ఎస్‌ కోటేశ్వరరావు, ఎస్‌ఐలు నాగబాబు, దుర్గా ప్రసాద్‌, సుధాకర్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కాలనీలో కొత్తగా వచ్చిన వ్యక్తులను ప్రశ్నించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా అని తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:35 AM