Share News

ఉమ్మడి జిల్లాలో పోలీస్‌ సేవా పతకాలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:53 AM

ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌కు అతి ఉత్కృష్ట్ట సేవా పతకం ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏప్రిల్‌ 12న ఏలూరు రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో పనిచేసి శాంతి భద్రతలు కాపాడడంలో ప్రత్యేక స్థానాన్ని ప్రజల్లో ఇనుమడింపచేసుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో పోలీస్‌ సేవా పతకాలు

రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌కు అతి ఉత్కృష్ట సేవా పతకం

ఏలూరు క్రైం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌కు అతి ఉత్కృష్ట్ట సేవా పతకం ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏప్రిల్‌ 12న ఏలూరు రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో పనిచేసి శాంతి భద్రతలు కాపాడడంలో ప్రత్యేక స్థానాన్ని ప్రజల్లో ఇనుమడింపచేసుకున్నారు. 2024 జనవరి ఒకటి నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఏలూరు రేంజ్‌ ఐజీగా విధులను నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందికి అతి ఉత్కృష్ట సేవా పతకం, ఉత్కృష సేవా పతకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 40 మంది పోలీస్‌ అధికారులు సిబ్బందికి ప్రభుత్వం ఈ సేవా పతకాలను ప్రకటించాయి.

అతి ఉత్కృష్ట సేవా పతకాలు : ఏలూరు స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్స్‌ పి.రామాంజ నేయులు (ముదినేపల్లి పీఎస్‌), పి.దుర్గారావు (వేలేరుపాడు), బీఎం కృష్ణారావు (కొయ్యలగూడెం), కె.శ్రీనివాసరావు (లక్కవరం), జె.భీమా శంకర్‌ (జంగారెడ్డిగూడెం), జిల్లా ఆర్ముడు రిజర్వు హెడ్‌కానిస్టేబుల్‌ సీహెచ్‌వీ సత్యనారాయణ (ఏలూరు)లకు అతి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఉత్కృష్ట సేవా పతకాలు : ఏలూరు జిల్లా ఏఆర్‌ఆర్‌ఐ జీఎస్‌పీఏ భావన్‌కుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్లు దారపురెడ్డి ఓం ప్రకాష్‌ (ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌), పిట్టా రత్నరాజు (నిడమర్రు), గుంజెం శ్రీనివాస్‌ (పోలవరం), కెల్లా నాగబాబు (డీఎస్‌బీ ఏలూరు), జోడే మోషే (ధర్మాజీగూడెం), సరెళ్ళ వెంకటేశ్వరరావు (ఏలూరు టూటౌన్‌), తోళం నాగ శ్రీనివాసరావు (కుక్కునూరు), ఏఆర్‌ కానిస్టేబుల్స్‌ కె.పోసియ్య, అంజూరి వినయ్‌ సతీష్‌, కురసం చెల్లయ్య, వన్నెంరెడ్డి సత్యనారాయణ, సివిల్‌ కానిస్టేబుళ్ళు పెనుగంటి హరిబాబు (ఏలూరు సీసీఎస్‌), పొట్ల కాంతయ్య (భీమడోలు).

పశ్చిమ గోదావరి జిల్లాలోని అతి ఉత్కృష్ట సేవా పతకాలు

హెడ్‌కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాసరెడ్డి (అత్తిలి), బి.ఏడుకొండలు (నరసా పురం), వీవీయూ రామానుజనేయులు(తణుకు పీఎస్‌), వాసర్ల శ్రీహరి (వీరవాసరం), పశ్చిమగోదావరి జిల్లా, జిల్లా ఆర్ముడు రిజర్వు హెడ్‌ కానిస్టేబుల్‌ కె.సువర్ణరాజు.

రైల్వే విభాగంలో తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్‌ సీహెచ్‌ మోహన్‌వెంకట సీతారామయ్య.

ఉత్కృష్ట సేవా పతకాలు :

తణుకు టౌన్‌ సీఐ ఎన్‌.కొండయ్య, హెడ్‌కానిస్టేబుళ్లు వై. శ్రీనివాసరావు (తాడేపల్లిగూడెం), ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుళ్లు కె.రాంబాబు, ఎస్‌.సుధాకర్‌, కానిస్టేబుళ్లు సీహెచ్‌జీవీవీ రమేష్‌ (పోడూరు), పి.గంగాధరరావు (భీమ వరం టూటౌన్‌), వై.శ్రీనివాసరావు(మొగల్తూరు),వి. ఉమామహేశ్వ రరావు (నరసాపురం), డి.వీరబాబు (ఆచంట), సీహెచ్‌ మధుసూదనరావు (పాల కొల్లు టౌన్‌), ఎస్‌.శ్రావణ్‌కుమార్‌ (తణుకు ట్రాఫిక్‌), పి.మనోజ్‌ (భీమవరం వన్‌టౌన్‌), కమ్యూనికేషన్ల విభాగంలో మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.ప్రమీల (భీమవరం)

రైల్వే విభాగంలో భీమవరం రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్‌ బి.రాజబాబు.

సీఐడీ సీఐ రమణకు అతి ఉత్కృష్ట సేవా పతకం

పాలకోడేరు,మార్చి18 (ఆంఽధ్రజ్యోతి) శృంగవృక్షం శివారు బంటుమిల్లికి చెందిన పాలా వెంకటరమణ విజయవాడలోని మంగళగిరిలో సీఐడి సీఐగా విదులు నిర్వర్తిస్తున్నారు. అత్యున్నత సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2025కు గాను ప్రతిష్ఠాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపిక చేశారు. బంటుమిల్లికి చెందిన పాలా వేణుమాధవరావు, హైమావతి దంపతుల కుమారుడు వెంకటరమణ. అతి కొద్దిరోజులు మాత్రమే ఉపా ధ్యాయుడిగా మత్య్సపురిలో పనిచేశారు. 1995లో ఎస్‌ఐగా ఎంపికై తూర్పు గోదావరి జిల్లా రాయవరం, రాజమండ్రి, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2010లో పదోన్నతిపై రాజమండ్రి ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. 2020 నుంచి సీఐడీ మంగళగిరి తాడేపల్లి, విజయవాడలో సీఐగా పనిచేస్తున్నారు. పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

Updated Date - Mar 19 , 2026 | 12:53 AM