వదినతో చనువుగా ఉంటున్నాడని హత్యకు కుట్ర
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:34 AM
తన వదినతో చనువుగా ఉంటున్నాడని ఎలాగైనా హతమార్చాలని కక్ష పెంచుకుని తన స్నేహి తుడికి చెందిన నాటు తుపాకీలు సిద్ధం చేసు కుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు.. కేసులు నమోదు
ఐదుగురి అరెస్టు.. ఆరు నాటు తుపాకులు స్వాధీనం
ఏలూరు క్రైం, జూలై 25(ఆంధ్రజ్యోతి):తన వదినతో చనువుగా ఉంటున్నాడని ఎలాగైనా హతమార్చాలని కక్ష పెంచుకుని తన స్నేహి తుడికి చెందిన నాటు తుపాకీలు సిద్ధం చేసు కుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిం దితులను విచారించగా నాటుతుపాకీలు తయా రు చేసే మరో ముగ్గురిని అరెస్టు చేసి ఐదు తుపాకీలు, కొంత సామగ్రి స్వాధీనం చేసుకు న్నారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ కిశోర్ వెళ్లడించారు. చింతలపూడి మండలం భట్టు వారిగూడెం వైఎస్సార్ కాలనీకి చెందిన చందక సాయిబాబు(28) వదినతో సుబ్బారాయుడు గూడేనికి చెందిన పల్నాటి మహేశ్ చనువుగా ఉంటున్నాడని ఎన్ని సార్లు హెచ్చరించినా అత ని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో హత మార్చాలని సాయిబాబా నిర్ణయించుకున్నాడు. దీంతో అతని స్నేహితుడైన చింతలపూడి మం డలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన తాళం వీర బాబు(32) వద్ద ఉన్న నాటుతుపాకీ తీసుకుని వీరిద్దరు కలిసి పల్నాటి మహేశ్ వ్యవసాయం చేస్తున్న గణిచర్ల ప్రాంతంలో రెండు రోజుల నుంచి మహేష్‌ను హతమార్చాడానికి ఎదురు చూస్తున్నారు.ఈనెల 24న చింతలపూడి ఎస్‌ఐ వారి సిబ్బంది చింతలపూడి షాదీఖానా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సందక సాయి బాబు, తాళం వీరబాబులు మోటారు సైకిల్‌పై వస్తుండగా వారిని తనిఖీ చేశారు. వారి వద్ద ఒక నాటు తుపాకీ, లైవ్ బులెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఎస్పీ కిషోర్ ఆదేశాలతో చింతల పూడి పోలీసులు విచారణ చేపట్టారు. తాళం వీరబాబు ఇచ్చిన వాగ్మూలం ప్రకారం నాటు తుపాకీలు తయారు చేసే వెంకటాద్రి గూడే నికి చెందిన యలగం నాగేశ్వరరావు, కమలా పురం గ్రామానికి చెందిన తోటకూర రామ రాజు(43)లను అదు పులోకి తీసుకుని, ఐదు నాటు తుపాకీలు, వాటి తయారీకి వినియో గించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ బ్యారల్ గొట్టాన్ని ఏలూరులోని పవర్ పేట రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న మంతెన వీరభద్రాచారి(60) తయారు చేసి ఇచ్చాడని చెప్పడంతో అతనిని కూడా అరెస్టు చేసి అతని వద్ద నుంచి బేరర్ తయారు చేయడానికి వారే రెండు ఇనుప గొట్టాలను స్వాధీనం చేసుకున్నా రు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. వీరి నుంచి ఆరు నాటు తుపా కులు, తయారు చేస్తున్న ఒక తుపాకీ చెక్క, నాలుగు తుపాకీ తూటాలు, తుపాకీ తయారీకి ఉపయోగించే పేలుడు పదార్ధాం, తుపాకి త యారు చేయడానికి వినియోగించే పరికరాలు, ఒక తుపాకీ మెకానిజం భాగం, రెండు ఇనుప బేరర్ గొట్టాలు, ఒక వెల్డింగ్ మిషన్, ఒక మో టారు సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిం చారు. కేసు దర్యాప్తు, నిందితులను అరెస్టు చే యడంలో ప్రతిభ కనబర్చిన చింతలపూడి పోలీసులను ఎస్పీ అభినందించారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ ప్రసాదరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు, చింతలపూడి సీఐ క్రాంతి కుమార్, ఎస్‌ఐ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.