Share News

టార్గెట్‌ డిసెంబరు!

ABN , Publish Date - Aug 28 , 2026 | 01:08 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేప ట్టింది.

టార్గెట్‌ డిసెంబరు!
చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

శరవేగంగా చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణ పనులు

2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తికి చర్యలు

అంతకంటే ముందే ఈ ఏడాది డిసెంబరులో నిర్వాసితుల తరలింపు

ఆ దిశగా చల్లావారిగూడెం నిర్మాణ పనుల్లో ఉరుకులు పరుగులు

పనుల పురోగతిపై కలెక్టర్‌వారం వారం సమీక్షలు

జంగారెడ్డిగూడెంరూరల్‌, ఆగస్టు 27 (ఆంధ్ర జ్యోతి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేప ట్టింది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరా లకు ముందు గానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకు సమాంతరంగా నిర్వా సితుల తరలింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబరులోగా నిర్వా సితులను పునరావాస కాలనీలకు తరలించే లక్ష్యంతో ఆర్‌అండ్‌ఆర్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

41.15 కాంటూరు పరిధిలో నిర్వాసితులకు..

41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసిత కుటుంబాలకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలోని చల్లావారి గూడెంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండ లాలతో పాటు పోలవరం జిల్లాలో కూనవరం, వీఆర్‌పురం, చింతపూరు గ్రామాల్లోని గిరిజనేతర కుటుంబాలను తరలించనున్నారు.

కుక్కునూరు మండలంలో గొమ్ముగూడెం, సీతారామనగరం, కుక్కునూరు–ఎబ్లాక్‌, కివ్వాక, చీరవల్లి, దామరచర్ల గ్రామాలకు చెందిన గిరిజ నేతరుల కుటుంబాలకు చల్లావారిగూడెంలో పునరావాసం కల్పించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కుటుంబమూ ఇక్కడకు రాలేదు.

వేలేరుపాడు మండలంలో కోయిదా, కాచారం, కటుకూరు, చిట్టెంరెడ్డిపాలెం, యడ వల్లి, టేకూరు, బోళ్ల పల్లి, చిగురుమామిడి, కొత్తూరు, నాళ్లవరం, నాళ్లవరం కాలనీ, తిరు మలాపురం, కన్నాయిగుట్ట, రుద్రమకోట, రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము, వేలేరుపాడు మొత్తం 17 గ్రామాలకు చెందిన గిరిజనేతరులు చల్లావారి గూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి రాను న్నారు. ఇప్పటి వరకు సుమారు 500 కుటుంబాలు గత వరదల సమయంలో ఇక్క డకు వచ్చి నివాసం ఉంటున్నారు.

పోలవరం మండలంలోని కొరుటూరు, శివగిరి, చీడూరు, టేకూరు, తూటికుంట, కోండ్రు కోట, వాడపల్లి, శిరివాక మొత్తం ఎనిమిది గ్రామాలకు చెందిన 150 నిర్వాసిత కుటుంబాలు ఇక్కడకు రావాల్సి వుండగా ఇప్పటికే 70కి పైగా కుటుంబాలు చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోకి వచ్చి నివాసం ఉంటున్నారు.

డిసెంబరు కల్లా 3,905 ఇళ్లు పూర్తి

కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండ లాల్లోని నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో కేటా యించిన 3,905 ఇళ్లకు ఇప్పటి వరకు సుమారు 3000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2018లో ఈ పనులు ప్రారంభం కాగా 2023 నాటికి 2,453 ఇళ్లు నిర్మించినా చాలా పనులు అసం పూర్తిగానే సాగాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు మందగించాయి. కూటమి ప్రభుత్వం రాగానే టెండర్లను పిలిచి వేరే కాం ట్రాక్టర్లకు పనులను అప్పగించడంతో పనులు పుంజుకున్నాయి. ఈ ఏడాది డిసెంబరు కల్లా 3,905 ఇళ్లు నిర్మాణాలు పూర్తి కానున్నాయి. వాస్తవానికి 2027 జూన్‌ వరకు ఇళ్లు నిర్మించేం దుకు కాంట్రాక్టర్‌లకు గడువు ఉన్నప్పటికీ పోల వరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసే దిశగా ఈ ఏడాది చివరికే పనులు పూర్తయ్యేలా నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేశారు. వీటితో పాటు సొంతంగా ఇళ్లు నిర్మించుకునే మరో 700 కుటుంబాలకు ఇక్కడ కేటాయించిన భూమిలో అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి చేస్తున్నారు.

వారానికోసారి కలెక్టర్‌ సమీక్ష

ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పురోగతిపై కలెక్టర్‌ వెట్రిసెల్వి వారానికోసారి సమీక్షలు నిర్వహిస్తూ.. పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? ఎక్కడ జాప్యం జరుగుతోంది? తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అనే అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

త్యాగాలకు తగిన పునరావాసం అందేనా?

పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లు, గ్రామాలను వదులుకున్న నిర్వాసితులకు పునరావాసం అత్యంత కీలకం. కేవలం ఇళ్లు నిర్మించడం మాత్రమే కాకుండా.. కొత్త ప్రాంతంలో వారికి మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అనుకున్న విధంగా ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తిచేసి నిర్వాసితులను తరలిస్తే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తయినట్లే. ఇప్పుడు అందరి దృష్టి చల్లవారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ పనులపై.. డిసెంబర్‌ టార్గెట్‌పైనే ఉంది.

డిసెంబరు కల్లా పనులను పూర్తి

నిర్వాసితులకు నివాసయోగ్యం ఉండేలా ఇళ్లను నిర్మించి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. డిసెంబరు కల్లా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మొత్తం 24 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఆసుపత్రి, స్కూల్స్‌, అంగన్‌వాడీలు, హెల్త్‌ కేర్‌ సెంటర్‌, చర్చి, గుడి, మసీదు, బస్టాప్‌, ఉపాధి, స్కిల్‌ డెవల్‌మెంట్‌ సెంటర్‌, ఇండోర్‌ స్టేడియం ఇలా అన్ని సదుపాయాలతో ఒక టౌన్‌షిప్‌లా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఉండనుంది.

– కేవీవీఎస్‌ ప్రసాద్‌, హౌసింగ్‌ ఈఈ

Updated Date - Aug 28 , 2026 | 01:08 AM