Share News

పోలవరం.. సూపర్‌ వేగం

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:39 AM

పోలవ రం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనుల కోసం కేంద్ర మంత్రి మండలి రూ.23.47 కోట్ల అదనపు నిధులు అందించడానికి ఆమోదం తెలిపింది.

పోలవరం.. సూపర్‌ వేగం

ఈ ఏడాది జూన్‌ నాటికి సొరంగాల పనులు పూర్తయ్యేలా.. కేంద్రం అదనపు నిధులు మంజూరు

63, 64 ప్యాకేజీల్లో గ్యాంట్రీ క్రేన్‌ల కొనుగోలుకు రూ.47.98 కోట్లు

పోలవరం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పోలవ రం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనుల కోసం కేంద్ర మంత్రి మండలి రూ.23.47 కోట్ల అదనపు నిధులు అందించడానికి ఆమోదం తెలిపింది. ఇరిగేషన్‌ హెడ్‌ వర్క్స్‌ ప్యాకేజీ నెంబరు 63 తోట గొంది–మామిడిగొంది గ్రామాల మధ్య వున్న కొండను తొలిచి నిర్మిస్తున్న జంట సొరంగాల పనులను వేగవంతంగా చేసేందుకయ్యే అదనపు ఖర్చును వినియోగానికి ఈ మొత్తాన్ని ఆమో దించింది. దీనివల్ల 2027 జూన్‌ నాటికి పూర్తి కావాల్సిన కుడి కాలువ కనెక్టివిటీ టన్నెల్‌ పను లు 2026 జూన్‌ నాటికి పూర్తి చేయడమే ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వ పాలన లో ఐదేళ్లపాటు జంట సొరంగాల పనులను నిర్లక్ష్యం చేయడంతో ప్యాకేజీ నెంబరు 63లో ఎడమ వైపు సొరంగం మధ్యలో కొంతమేర లోపలకు కుంగిపోయింది. దానివల్ల పనులు మరింత జాప్యమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఆరంభం కాగానే పనులు వేగవంతం కావడమే గాక 900 మీటర్ల పొడవున్న ఈ జంట సొరం గాల సామర్ధ్యాన్ని 20 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కుల నీటి పంపిణీ జరి గేలా సొరంగాల విస్తరణ పనులు చేపట్టారు. లోపల కొండరాళ్లు దెబ్బతిన్న ప్రాంతంలో అదనపు పను లు చేయడానికి పనుల వేగం పెంచడానికి వీలు గా మరో గ్యాంట్రీ క్రేన్‌ను ఈ నిధులతో కొనుగోలు చేయనున్నారు.

ఒకేసారి రెండు టీఎంసీలు మళ్లించేలా

ప్యాకేజీ నెంబరు 64లో నిర్మిస్తున్న జంట సొరంగాల నిర్మాణానికి అదనపు గ్యాంట్రీ సేకరణ బెడ్‌ పే లైన్‌ లైనింగ్‌లకు అదనంగా అయ్యే రూ.24.51 కోట్ల ఆర్థిక భారానికి సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. 880 మీటర్ల జంట సొరంగాల విస్తరణ పనులు ఒకేసారి రోజుకు రెండు టీఎంసీల నీటిని మళ్లించేలా డిజైన్‌ చేశా రు. ఉన్న ఒక్క గ్యాంట్రీతో పనులు చేయడానికి ఎక్కువ సమయం పడుతున్న క్రమంలో కొత్త గ్యాంట్రీ కొనుగోలు చేయనున్నారు.

జూన్‌ నాటికి పూర్తయితే..

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో ఒక పక్క ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మాణం, మరో పక్క డయాఫ్రంవాల్‌ పనులు వేగం పుంజు కున్నాయి. ఈ దశలో జంట సొరంగాల నిర్మాణం 2026 జూన్‌ నాటికి పూర్తయితే పోలవరం కుడి ప్రధాన కనెక్టివిటీ నుంచి కృష్ణా నదికి, ప్రకాశం బ్యారేజికి అక్కడి నుంచి రాయలసీమ వరకూ 7.2 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు 80 టీఎంసీల సాగునీరు, 540 గ్రామాల్లో 28.5 లక్షల ప్రజలకు తాగు నీరు పుష్కరాలకు ముందే అందుతుంది. గోదావరి, కృష్ణా నదుల ప్రధాన కాలువల్లో నీటి నిల్వల ద్వారా అనుసంధానమైన చిన్న తరహా నీటి కాలువల ద్వారా 13.08 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా కలుగుతుంది. ఎగువ రాష్ట్రం ఒడిశాకు సైతం ఐదు టీఎంసీల నీటిని అందించవచ్చు.

Updated Date - Mar 15 , 2026 | 12:39 AM