Share News

పోలవరం పరుగులు

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:17 AM

పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతు న్నాయి. ఎక్కడికక్కడ భారీ యంత్రాలు, వాహనా లతో ప్రాజెక్టు ప్రాంతంలో పనులు పరుగులు పెడు తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.

పోలవరం పరుగులు
డయా ఫ్రం వాల్‌ వద్ద పనులు..

ఎక్కడికక్కడ భారీ యంత్రాలతో పనులు

గోదావరిలో గ్యాప్‌–2లో డయా ఫ్రం వాల్‌

గ్యాప్‌–1లో డ్యామ్‌ ఫౌండేషన్‌ పనులు

పవర్‌ ప్రాజెక్టుకు 50 శాతం సివిల్‌ వర్క్‌

నేడు సీఎం చంద్రబాబు రాక

పనులు వేగవంతానికి దిశా నిర్దేశం

(ఏలూరు/పోలవరం–ఆంధ్రజ్యోతి):

పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతు న్నాయి. ఎక్కడికక్కడ భారీ యంత్రాలు, వాహనా లతో ప్రాజెక్టు ప్రాంతంలో పనులు పరుగులు పెడు తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. గోదావరిలో ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2 లో డయా ఫ్రం వాల్‌ పనులు జరుగుతున్నాయి. దానిని ఆనుకుని అంగులూరులో ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌ నిర్మాణానికి జరుగుతున్న ఫౌండేషన్‌ పనులు, దానికి ఎదురుగా పవర్‌ ప్రాజెక్టు పనులు, ఎడమ ప్రధాన కాలువ టన్నెల్‌ నిర్మాణ పనులు చకాచకా సాగుతు న్నాయి. వైసీపీ హయాంలో ఇక్కడి యంత్రాలు తుప్పుపట్టాయి. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక మూడో సారి చంద్రబాబు పోలవరం పర్యటనకు బుధవారం రానున్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తిచేసే లక్ష్యంతో దిశా నిర్దేశం చేయనున్నారు.

వేగంగా డయాఫ్రం వాల్‌ పనులు

గ్యాప్‌–2లో డయా ఫ్రం వాల్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 15 భారీ యంత్రాలు పనిచేస్తున్నాయి. డయా ఫ్రం వాల్‌ మొత్తం పొడవు 1396.6 మీటర్లు. ఇప్పటి వరకూ 576.2 మీటర్లకు పైగా పని పూర్త య్యింది. రాక్‌ ఫిల్‌ వర్క్‌ చేస్తున్నారు. ఇప్పటికి 85 శాతం పనులు జరిగినట్టు అధికారులు చెబుతున్నా రు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం వల్ల ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద సీపేజీ జలాలు చేరుకున్నాయి. ఆ నీటిని గో దావరిలోకి తరలించేందుకు భారీ మో టార్ల ద్వారా డీవాటరింగ్‌ చేస్తున్నారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది. సీపేజీ రాకుండా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ కు ప్రాజెక్టు వైపు బట్రస్‌ డ్యామ్‌ నిర్మి స్తున్నారు. ఇది 7.5 మీటర్ల ఎత్తులో 40 మీటర్ల వెడల్పున నిర్మిస్తున్నారు.

ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1 నిర్మాణానికి ఫౌండేషన్‌ పనులు చేస్తున్నారు. గ్యాప్‌– 1, 2 కలిపి ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ అవుతుంది. డ్యామ్‌కు ఎగువన కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సంబంధించి టన్నెల్స్‌ నిర్మాణ పనులు మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పనులపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు.

పవర్‌ ప్రాజెక్టు పనులు

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే సరికి పవర్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే 50 శాతం సివిల్‌ వర్క్‌ జరిగింది. గోదావరి ఒడ్డున అంగులూరులోని పెద్దకొండల తొలిచి 12 టర్బైన్స్‌ నిర్మించారు. ఈ టర్బైన్స్‌కు ఇప్పటికే లైనింగ్‌ వర్క్‌ చేశారు. మిగతా ఐరన్‌ వర్క్‌ జరుగుతోంది. మొ త్తం 12 యూనిట్ల కింద విభజించారు. దీని వెనుక పవర్‌ ప్రాజెక్టుకు అవసరమైన సామగ్రి కోసం రెండు పెద్ద స్టోరేజీలను నిర్మిస్తారు.

ఇదీ పోలవరం పురోగతి :

పోలవరం ప్రాజెక్టుకు పనులు ఇప్పటి వరకు 60 శాతం జరిగాయి. సివిల్‌ వర్క్‌ 87.80 శాతం, హెడ్‌ వర్క్‌ 76.43 శాతం, కుడి ప్రధాన కాలువ(ఆర్‌ఎంసీ) 92.75 శాతం, ఎడమ ప్రధాన కాలువ(ఎల్‌ఎంసీ) 74.43 శాతం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు 26.76 శాతంపైగా జరిగాయి.

కూటమి అధికారంలో వచ్చాక

2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఇప్పటి వరకు రూ.5052.71 కోట్ల అడ్వాన్సులను తెచ్చి పనులు వేగవంతం చేశారు. డయా ప్రమ్‌ వాల్‌కు 55,589 చదరపు మీటర్లు పని జరిగింది. లక్ష్యంలో 85 శాతం మేర పూర్తయింది. ఎడమ ప్రఽధాన కాల్వ అనుసంధాన పనుల్లో 94 శాతం మట్టి పనులు, ,75 శాతం లైనింగ్‌ పనులు, 77 శాతం ఆకృతుల పనులు పూర్తయ్యాయి.

Updated Date - Jan 07 , 2026 | 01:17 AM