Share News

విద్యాలక్ష్మి.. వరం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:16 AM

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పీఎం విద్యాలక్ష్మి పథకం పేద విద్యార్థులకు వరంలా మారింది. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

విద్యాలక్ష్మి.. వరం

ఉన్నత చదువులకు వడ్డీ రాయితీతో బ్యాంకు రుణాలు

పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ పథకంతో ఎంతో మేలు

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 2(ఆంధ్ర జ్యోతి):ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పీఎం విద్యాలక్ష్మి పథకం పేద విద్యార్థులకు వరంలా మారింది. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక, ఉన్నత విద్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌ సంయుక్తం గా విద్యా లక్ష్మి పోర్టల్‌ను రూపొందించాయి. విద్యార్థులకు 90 రకాల విద్యా రుణాలు అంది స్తూ విద్యార్థుల్లో ఉన్నత విద్య కలలను సాకా రం చేస్తున్నాయు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నతంగా చదువుకోవాలన్న ఆకాంక్ష ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ పథకం ఉప యోగపడుతుంది. ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి రుణ సహాయం అందుతుంది.

రుణాలు ఇలా..

ఈ పథకం కింద మూడు విభాగాలలో రుణాలు ఇస్తారు. రూ.4 లక్షలలోపు రూ.4 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకూ, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు మంజూరు చేస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న కోర్సు ఫీజుకు అనుకూలంగా రుణం ఎంపిక చేసుకోవచ్చు. ఎలాంటి గడువు తేదీ ఉండదు. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయం రూ.9 లక్షలలోపు ఉండాలి. రూ.10 లక్షల రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ రుణాలకు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటిగా ఉండడంతో బ్యాంకులు ముందుకొస్తున్నాయి. కేవలం ట్యూషన్‌ ఫీజుకే కాకుండా హాస్టల్‌, పరీక్ష, ల్యాబ్‌, పుస్తకాలు విద్యా సామగ్రి రుణాన్ని వినియోగించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు

రుణం కావాలనుకునే వారు విద్యాలక్ష్మి పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోర్టల్‌లో బ్యాంకుల రుణ పథకాలు పొందుపరిచారు. వాటిని పరిశీలించి నచ్చిన బ్యాంకుకు దరఖాస్తు పంపొచ్చు. ఎంచుకున్న బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేసి వివరాలు పొందుపరచాలి. విద్యారుణం ఫారం ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తు ప్రోగ్రెస్‌ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలించవచ్చు.

ఏ కోర్సులకు ఇస్తారంటే..

మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, లా టెక్నికల్‌, శాస్త్రీయ కోర్సులు, బి.ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశో ధన కోర్సులు, సీఏ, సీఎస్‌, ఎంఏతోపాటు డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు దేశంలోని 800 ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొంది ఉండాలి. గరిష్టంగా రూ.7.50 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.

ఏటా వెయ్యి మందికి పైగా రుణం

ఉమ్మడి జిల్లాలో విద్యా రుణాలు తీసుకుని ఏటా వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని విద్యార్థి కోరుకున్న బ్యాంకులో రుణం పొందే అవకాశం ఉంది. ఈ పథకం పేద, మధ్య తరగతి పిల్లల ఉన్నత విద్యకు వెసులు బాటు ఇస్తుంది.

– వి.రామకృష్ణప్రసాద్‌, ఆర్‌బీవో చీఫ్‌ మేనేజర్‌

రూ.20 వేల వడ్డీ రాయితీ

మాది రావిపాడు. ఎంసీఏ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నా. చదువుకునే సమయం లో లక్ష రూపాయలు రుణం తీసుకున్నా. ఉద్యో గం రాగానే రుణం తీర్చా. ఈ పథకం ద్వారా నాకు రూ.20 వేల వరకూ వడ్డీ రాయితీ లభిం చింది. ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతుంది.

– చిట్యాల నరసింహారావు, ఐటీ ఉద్యోగి

Updated Date - Jun 03 , 2026 | 12:17 AM