పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రఽధాని జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:50 AM
దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పోలవరం ప్రాజెక్టు హిల్‌వ్యూ ప్రాంతంలో భారీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
పోలవరం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పోలవరం ప్రాజెక్టు హిల్‌వ్యూ ప్రాంతంలో భారీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జన సేన నియోజకవర్గ శ్రేణులు, ప్రాజెక్టు ఇంజ నీర్లతో కలిసి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వ హించి దీపాలు వెలిగించారు. మంత్రి మాట్లా డుతూ..‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం నుంచి సహకారం అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహాయ సహకారాలతో పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాని జన్మదిన వేడుకలు ప్రాజెక్టు వద్ద నిర్వహించడం సంతోషంగా ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలనే ప్రధాని ఆలోచనలకు అనుగుణం గా దేశం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా’ మన్నారు. బీజేపీ నాయకులు గారపాటి తపన చౌదరి, మండల టీడీపీ అధ్యక్షుడు మంగిన కొండ, పాదం ప్రసాద్, నల్లా రాంబాబు, పోతు ల శ్రీను, యడ్ల వినోద్, బీజేపీ నాయకులు కరి బండి నాగరాజు, బొరగం వెంకటలక్ష్మి, కామి శెట్టి నాగరాజు, దత్తిదేవి పాల్గొన్నారు.