ప్లీజ్ మీరు రావద్దు
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:05 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సంఘాల సీఈవోల బదిలీలు నిర్వహించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేస్తు న్నారు.
సహకార సంఘాల్లో సీఈవోలను చేర్చుకునేందుకు త్రిసభ్య కమిటీల విముఖత
ముదినేపల్లి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సంఘాల సీఈవోల బదిలీలు నిర్వహించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేస్తు న్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం సీఈవోలకు జీతాలు చెల్లించే సామర్థ్యం లేని సహకార సం ఘాల నుంచి ఆ ఉద్యోగులను టర్నోవర్ ఎక్కువ గా ఉండి ఆర్థికంగా బలపడిన సంఘాలకు బది లీ చేసేందుకు డీసీసీబీ అధికారులు ప్రయత్నా లు చేస్తున్నారు. అయితే జీవో ప్రకారమే జీతాలు తీసుకుంటున్న సీఈవోలను తమ సంఘాల్లో నియమించేందుకు ఆర్థికంగా బలపడిన సహ కార సంఘాల త్రిసభ్య కమిటీలు వ్యతిరేకిస్తు న్నాయి. ఎందుకంటే జీవో ప్రకారం నెలకు రూ. 50 వేలకు పైగా జీతం తీసుకుంటున్న సీఈవో లను చేర్చుకుంటే తమ సంఘంపై ఆర్థిక భారం పడుతుందన్నది వారి వాదన.
రూ.50 వేల జీతం ఇవ్వలేం
2019 మార్చి తర్వాత గుమస్తాగా సీనియారి టీపై ప్రమోషన్ పొంది నేటికీ రెగ్యులర్ కాని పలువురు సీఈవోలకు సుమారు రూ.25 వేల నుంచి 30 వేల జీతం ఇస్తున్నారు. అటువంటి వారి స్థానంలో జీవో ప్రకారం రూ. రూ.50 వేల కు పైబడి జీతం తీసుకుంటున్న సీఈవోలను ఆ మేరకు జీతాలు చెల్లించే సామర్థ్యం కలిగిన సంఘాలకు బదిలీ చేయాలన్నది అధికారుల నిర్ణయంగా ఉంది. ఇటీవల జీవో ప్రకారం రూ. 55 వేలకు పైగా జీతం తీసుకుంటున్న సీఈవో ను జీతాలు చెల్లించే సామర్థ్యం ఉన్న మండవల్లి మండలం తక్కెళ్లపాడు సహకార సంఘం నుంచి ముదినేపల్లి మండలం చిగురుకోట సహ కార సంఘానికి కేడీసీసీ బ్యాంకు అధికారులు బదిలీ చేయగా చేర్చుకునేందుకు చిగురుకోట సంఘ త్రిసభ్య కమిటీ అంగీకరించకపోవడంతో బదిలీ రద్దయింది. జీవో ప్రకారం జీతాలు చెల్లించే సామర్థ్యం లేని సహకార సంఘాల విషయంలో స్పష్టమైన విధానం లేక ఈ పరిస్థితి ఎదురవుతోంది.
ఇటువంటి సంఘాలను ఆదుకునేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉమ్మడి నిధిని ఏర్పాటు చేసి, దాని నుంచి బలహీన సంఘాల సీఈవో లు, ఇతర ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని
2019లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 36లో పేర్కొంది. కాని, దాని అమలులో జరుగు తున్న జాప్యం కారణంగా
పలు సంఘాలు సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి చేరుతున్నాయి. అటువంటి సంఘాల నుం చి ఇప్పుడు ఆర్థికంగా బలపడిన సంఘాలకు సీఈవోలను బదిలీ చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాలో 25 చిన్న సహకార సంఘాల్లో రూ.50 వేలు పైబడి జీతాలు తీసుకుంటున్న సీఈవోలు ఉండగా, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో 10 చిన్న సొసైటీల్లో రూ.50 వేలు పైబడి జీతం తీసుకుంటున్న సీఈ వోలు ఉన్నారు. వారిని పెద్ద సొసైటీలకు బదిలీ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తు న్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పలుచోట్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.